Realme తన కొత్త స్మార్ట్‌ఫోన్ రియల్‌మీ 14T 5Gని భారతదేశంలో అధికారికంగా ప్రవేశపెట్టింది.రియల్ మీ ఈ ఫోన్ పై రూ. 1,000 రూపాయల బ్యాంక్ మరియు ఎక్స్ చేంజ్ బోనస్ ఆఫర్ అందించింది. ఈ ఫోన్ పై ఆల్ బ్యాంక్ క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్ పై బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. ఈ రెండు ఆఫర్స్ కూడా అందుకోవచ్చు. ఈ ఆఫర్స్ తో ఈ ఫోన్ ను రూ. 15,999 రూపాయల ప్రారంభ ధరకే పొందవచ్చు.ఈ రియల్ మీ ఫోన్ చాలా స్లీక్ డిజైన్ అమ్ర్క్యు లగ్జరీ డిజైన్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో 6.67 ఇంచ్ AMOLED స్క్రీన్ ను అందించింది. ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్, 2100 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ మీడియాటెక్ Dimensity 6300 చిప్ సెట్ తో వస్తుంది. ఈ ఫోన్ 8GB ఫిజికల్ ర్యామ్ 18GB వరకు డైనమిక్ ర్యామ్ మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది.
![]() |
![]() |