బాలికను వేధించి, అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన కేసులో కంకణాల కిరణ్‌కు విజయనగరం పోక్సో కోర్టు న్యాయాధికారి కె.నాగమణి మూడేళ్ల జైలు, రూ.2వేల జరిమానా విధిస్తూ శుక్రవారం తీర్పు వెల్లడించారని ఎస్ఐ సాగర్ బాబు ఓ ప్రకటనలో తెలిపారు. తెర్లాం మండలానికి చెందిన ఓ బాలిక ఈ ఏడాది ఫిబ్రవరిలో చేసిన ఫిర్యాదుపై అప్పట్లో కంకణాల కిరణ్‌పై కేసు నమోదు చేశామన్నారు. కేసు విచారణ పూర్తికావడంతో కిరణ్‌కు న్యాయాధికారి శిక్ష ఖరారు చేశారని ఎస్ఐ తెలిపారు. బాధితురాలికి రూ.25వేలు పరిహారం చెల్లింపునకు న్యాయాధికారి ఆదేశించారని ఎస్ఐ వివరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa