ట్రెండింగ్
Epaper    English    தமிழ்

“Waqf Act Amendment: సెప్టెంబర్ 15 సుప్రీంకోర్టు తీర్పు దేశాన్ని విడదీస్తుందా?”

national |  Suryaa Desk  | Published : Sat, Sep 13, 2025, 10:19 PM

వక్ఫ్ సవరణ చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు సెప్టెంబర్ 15, సోమవారం ఉదయం 10:30 గంటలకు మధ్యంతర తీర్పును ప్రకటించనుంది.
ఈ కేసులో మూడు ప్రధాన అంశాలపై తీర్పు వెలువడనుంది. వాటిలో:
'వక్ఫ్ బై యూజర్'
న్యాయస్థానాల ద్వారా వక్ఫ్ ఆస్తుల డీనోటిఫికేషన్ అధికారం
వక్ఫ్ ఆస్తుల గుర్తింపులో కలెక్టర్ విచారణ ప్రాధాన్యత అనే అంశాలున్నాయి.
*తీర్పు ముందు చరిత్ర:మే 22న, ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం, రెండు పక్షాల వాదనలు ముగిశాక తీర్పును రిజర్వ్ చేసింది. ఇప్పుడు సెప్టెంబర్ 15న ఈ కేసులో మధ్యంతర ఆదేశాలు వెలువడనున్నాయి.వక్ఫ్ సవరణ చట్టంలోని నిబంధనలను సవాల్ చేస్తూ పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ముఖ్యంగా ఈ మూడు అంశాలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి:
-ఇప్పటికే వక్ఫ్‌గా గుర్తించబడిన ఆస్తులను డీనోటిఫై చేసే అధికారం
-రాష్ట్ర వక్ఫ్ బోర్డులు మరియు కేంద్ర వక్ఫ్ కౌన్సిల్‌లో ముస్లిమేతరుల భాగస్వామ్యం
-కలెక్టర్ ఆధారంగా వక్ఫ్ ఆస్తుల గుర్తింపు ప్రక్రియ
*వాదనలు ఎలా జరిగాయి? వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న పక్షం తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపించారు.ఆయన ప్రకారం, ఈ సవరణలు చారిత్రకంగా, రాజ్యాంగ పరంగా అసమ్మతమైనవని, న్యాయరహితంగా వక్ఫ్ ఆస్తులను స్వాధీనం చేసుకునే మార్గంగా వర్ణించారు. తుది విచారణ జరిగే వరకు ఈ నిబంధనలపై స్టే ఇవ్వాలంటూ పిటిషనర్లు కోరారు.ఇంకా కేంద్ర ప్రభుత్వ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ, చట్టాన్ని గట్టిగా సమర్థించారు. వక్ఫ్ అనేది ఇస్లామిక్ భావన అయినప్పటికీ, ఇది లౌకిక వ్యవస్థలో చట్టబద్ధంగా పరిగణించదగిన అంశమేనని కేంద్రం స్పష్టం చేసింది.
*ప్రభుత్వపు స్టాండ్:ఏప్రిల్ 25న కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ 1,332 పేజీల అఫిడవిట్ దాఖలు చేసింది.ఈ చట్టంపై blanket stay ఇవ్వాలని కోరడాన్ని వ్యతిరేకిస్తూ, ఇది పార్లమెంట్ ద్వారా ఆమోదించబడిందనీ, రాష్ట్రపతి ఆమోదం కూడా పొందిందని పేర్కొంది. రాజ్యాంగబద్ధతను Bench మరోసారి గుర్తుచేసింది.
*తీర్పు ప్రాధాన్యత ఏమిటి?ఈ తీర్పు వక్ఫ్ చట్టంలో కీలక మలుపు తేల్చే అవకాశం ఉంది. మత ఆస్తుల నిర్వచనం, ప్రభుత్వాల పాత్ర, ముస్లిమేతరుల స్థానం వంటి అంశాల్లో కీలక మార్గదర్శకత్వం ఇవ్వనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa