ఆంధ్రప్రదేశ్లో రెండు ముఖ్య నగరాలైన రాజమండ్రి, తిరుపతి మధ్య విమానయాన సేవలు అందుబాటులోకి రానున్నాయి. దసరా పండగ సమీపిస్తున్న వేళ ప్రయాణికులకు ఇది శుభవార్త కానుంది. ఎంపీ పురందేశ్వరి ప్రత్యేక చొరవతో ఈ కొత్త సర్వీసును ఏర్పాటు చేసినట్టు విమానాశ్రయ అధికారులు తెలిపారు. అక్టోబర్ 1వ తేదీ నుంచి ఈ సేవలు ప్రారంభమవుతాయని ఏపీడీ ఎన్కే శ్రీకాంత్ వెల్లడించారు. ప్రముఖ విమానయాన సంస్థ అలయన్స్ ఎయిర్ ఈ సర్వీసులను నడపనుంది. వారంలో మూడు రోజుల పాటు, అంటే ప్రతి మంగళ, గురు, శనివారాల్లో విమానాలు రాకపోకలు సాగిస్తాయి. ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం, ప్రతిరోజూ ఉదయం 7:40 గంటలకు తిరుపతిలో విమానం బయలుదేరి 9:25 గంటలకు రాజమండ్రి చేరుకుంటుంది. తిరిగి రాజమండ్రిలో ఉదయం 9:50 గంటలకు బయలుదేరి 11:15 గంటలకు తిరుపతికి చేరుతుందని అధికారులు వివరించారు. ఈ కొత్త సర్వీసుతో రెండు నగరాల మధ్య ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa