ప్రముఖ మలయాళ నటుడు' మోహన్‌లాల్‌ను భారతీయ చిత్రసీమలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం వరించిన విషయం తెలిసిందే. నాలుగు దశాబ్దాలుగా సినీ రంగానికి ఆయన అందించిన విశేష సేవలను గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డును ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ శనివారం అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేసింది.ఈ అరుదైన గౌరవం దక్కడంపై మోహన్‌లాల్ స్పందించారు. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన తన ఆనందాన్ని, కృతజ్ఞతలను పంచుకున్నారు. ఈ పురస్కారం తన ఒక్కడిదే కాదని, తన సినీ ప్రయాణంలో తోడుగా నిలిచిన ప్రతి ఒక్కరిదని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఒక భావోద్వేగపూరిత నోట్‌ను అభిమానులతో పంచుకున్నారు."దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా, గౌరవంగా ఉంది. ఈ గౌరవం నాది మాత్రమే కాదు, ఈ ప్రయాణంలో నాతో పాటు నడిచిన ప్రతి ఒక్కరిది. నా కుటుంబం, ప్రేక్షకులు, సహనటులు, స్నేహితులు, శ్రేయోభిలాషుల ప్రేమ, నమ్మకం, ప్రోత్సాహమే నా అతిపెద్ద బలం. అవే నన్ను ఈ రోజు ఈ స్థాయిలో నిలబెట్టాయి. ఈ గుర్తింపును పూర్తి కృతజ్ఞతతో, నిండు హృదయంతో స్వీకరిస్తున్నాను" అని మోహన్‌లాల్ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa