విశాఖపట్నంలోని ఆరిలోవ BRTS రోడ్డులో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పురుషోత్తమపురంలో ఉంటూ విశాఖలోని ఓ కాలేజీలో చదువుతున్న విజయనగరం (D)కి చెందిన వినయ్ అనే యువకుడు మృతి చెందాడు. స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్లి తిరిగి వస్తుండగా, అతని స్నేహితుడు ఉదయ్ నడుపుతున్న బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వినయ్‌ను ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించాడు. ఉదయ్‌కు కూడా గాయాలైనట్లు సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa