AP: కడప జిల్లాలోని మైదుకూరులో విషాద ఘటన చోటు చేసుకుంది. ఛాతీలో నొప్పి వచ్చిన ఒక మహిళను బంధువులు స్థానికంగా ఉన్న మెడికల్ షాపునకు తీసుకెళ్లారు. ఆ షాపు నిర్వాహకుడు మహిళకు సెలైన్ ఎక్కించి, అందులో కొన్ని ఇంజెక్షన్లు కలిపాడు. ఆ ఇంజెక్షన్ల కారణంగానే మహిళ మరణించిందని బంధువులు ఆరోపిస్తున్నారు. దీనిపై స్థానికంగా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa