బల్క్ డ్రగ్ పార్క్ విషయంలో మత్స్యకారులకు ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి హామీ ఇవ్వలేదని మాజీ మంత్రి అమర్నాథ్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఈ నెల 22న ‘చలో రాజయ్యపేట’ కార్యక్రమం చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు డ్రగ్ పార్కును వ్యతిరేకించారని, అమరావతిలో వేల ఎకరాలు తీసుకుంటున్న చంద్రబాబు ఈ ప్రాజెక్టును అక్కడే పెట్టుకోవాలని, రాజయ్యపేట ప్రజలను ఇబ్బందులకు గురిచేయొద్దని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa