ఐఫోన్ వినియోగదారులు తమ ఫోన్ బ్యాటరీ హెల్త్ సులభంగా తనిఖీ చేసుకోవచ్చు, ఎందుకంటే ఈ ఫీచర్ ప్రతి ఐఫోన్‌లో అంతర్నిర్మితంగా ఉంటుంది. దీని ద్వారా బ్యాటరీ ఎప్పుడు మార్పు అవసరం అనేది ముందుగానే గుర్తించవచ్చు.కొన్ని ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు కూడా ఇప్పుడు ఈ ఫీచర్‌ను అందిస్తున్నాయి, కానీ చాలా ఆండ్రాయిడ్ వినియోగదారులకు ఇంతవరకు అందుబాటులో లేదు. అయితే, ప్రత్యేక యాప్‌ల సహాయంతో Android ఫోన్‌ల బ్యాటరీ హెల్త్ సులభంగా తనిఖీ చేయవచ్చు.Android వినియోగదారుల కోసం, AccuBattery యాప్ ఒక ఉత్తమ ఎంపిక. ఈ యాప్ మీ ఫోన్ బ్యాటరీ గురించి వివరమైన సమాచారాన్ని అందిస్తుంది. బ్యాటరీ ఆరోగ్యాన్ని తనిఖీ చేయడానికి, ముందుగా Play Store నుండి AccuBattery యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి. తర్వాత, మీ ఫోన్‌ను కనీసం రెండు సార్లు పూర్తి చార్జ్ (0% → 100%) మరియు డిశ్చార్జ్ (100% → 0%) చేయండి. అప్పుడు AccuBattery యాప్‌ను ఓపెన్ చేస్తే, మీ ఫోన్ బ్యాటరీ స్థితి డ్యాష్‌బోర్డ్‌లో స్పష్టంగా కనిపిస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa