ట్రెండింగ్
Epaper    English    தமிழ்

H-1B వీసాల ఫీజుపై తగ్గమంటున్న అమెరికా

international |  Suryaa Desk  | Published : Fri, Oct 24, 2025, 04:23 PM

అమెరికాలో నైపుణ్యం కలిగిన విదేశీ ఉద్యోగులకు జారీ చేసే H-1B వీసాలపై కొత్తగా విధించిన లక్ష డాలర్ల భారీ ఫీజు విధానాన్ని కోర్టులో సమర్థించుకుంటామని ట్రంప్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ పలు సంస్థలు దాఖలు చేసిన వ్యాజ్యాలపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. ఈ విధానం అమెరికన్ కార్మికుల ప్రయోజనాలను కాపాడటానికేనని వైట్ హౌస్ ఉద్ఘాటించింది. వైట్ హౌస్‌లో జరిగిన మీడియా సమావేశంలో ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ మాట్లాడుతూ, H-1B వీసా వ్యవస్థలో మోసాలు పెరిగిపోయాయని, దీనివల్ల అమెరికన్ల వేతనాలు పడిపోతున్నాయని ఆరోపించారు. "అధ్యక్షుడి మొదటి ప్రాధాన్యత ఎప్పుడూ అమెరికన్ కార్మికులకే. వీసా వ్యవస్థను బలోపేతం చేయాలన్నదే ఆయన లక్ష్యం. ఏళ్ల తరబడి H-1B వీసాల పేరిట మోసాలు జరుగుతున్నాయి. అందుకే ఈ వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకే అధ్యక్షుడు కొత్త విధానాలను తీసుకొచ్చారు. మా చర్యలు చట్టబద్ధమైనవి, అవసరమైనవి. ఈ విషయంలో కోర్టులో పోరాటం కొనసాగిస్తాం" అని ఆమె అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa