ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల పునర్విభజనపై ఇవాళ(మంగళవారం) క్యాబినెట్ సబ్ కమిటీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం కానున్నారు. ఉదయం 11 గంటలకు జిల్లాల పునర్విభజనపై సీఎం చంద్రబాబు సమీక్షించనున్నారు. ఈ సమావేశంలో కొత్త జిల్లాలు, రెవెన్యూ సబ్ డివిజన్లపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అనంతరం మ.12 గంటలకు రాష్ట్రంలో మొంథా తుఫాన్ పరిస్థితిపై అధికారులతో చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు. జిల్లాల పునర్విభజన కోసం ప్రభుత్వం గతంలో ఏడుగురు మంత్రులతో కూడిన ఓ ప్రత్యేక ఉపసంఘాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే జిల్లాల సరిహద్దుల మార్పుపై వచ్చిన ప్రజా అభిప్రాయాలు, ప్రతిపాదనలు సేకరణ పూర్తయినట్లు సమాచారం. ఇప్పుడు వాటిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఈ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాప్రతినిధులు, సామాజిక సంస్థలు, గ్రామస్థాయి వార్డుల నుంచి పెద్ద ఎత్తున అభ్యర్థనలను స్వీకరించింది. మొత్తం 200లకు పైగా అర్జీలు కమిటీ దృష్టికి వచ్చినట్లు తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa