ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాష్ట్రంలో అధికమౌతున్న ఏకోపాధ్యాయ పాఠశాలలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 28, 2025, 04:20 PM

రాష్ట్రంలో ఏకోపాధ్యాయ పాఠశాలల సంఖ్య గణనీయంగా పెరిగింది. రాష్ట్రంలో ఒకే ఉపాధ్యాయుడితో నడుస్తున్న బడుల సంఖ్య దాదాపు 13 వేలకు చేరినట్లు కేంద్ర విద్యా శాఖ విడుదల చేసిన ‘యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్’ (యూడైస్) 2024-25 నివేదిక స్పష్టం చేసింది. వివరాల్లోకి వెళితే... వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి ఈ జాబితాలో రాష్ట్రంలో 7 వేల లోపు ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉండగా, 2024-25 విద్యా సంవత్సరానికి ఆ సంఖ్య 12,912కు ఎగబాకింది. ఈ పాఠశాలల్లో గత విద్యా సంవత్సరంలో కేవలం 1,97,113 మంది విద్యార్థులు మాత్రమే చదువుకున్నారు. అంటే ఒక్కో పాఠశాలలో సగటున కేవలం 15 మంది విద్యార్థులే ఉన్నారన్నమాట.ఇదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మొత్తం 61,317 పాఠశాలలు, జూనియర్ కాలేజీలను పరిగణనలోకి తీసుకుంటే, 1 నుంచి 12వ తరగతి వరకు 84.54 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. దీని ప్రకారం రాష్ట్రంలో ప్రతి విద్యాసంస్థలో సగటున 138 మంది విద్యార్థులు ఉండగా, ఏకోపాధ్యాయ పాఠశాలల్లో మాత్రం ఈ సంఖ్య కేవలం 15కే పరిమితం కావడం గమనార్హం. రాష్ట్ర సగటుతో పోలిస్తే ఈ వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa