ఢిల్లీలో జరిగిన ఓ వివాహ వేడుకలో ఒక ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. సాంప్రదాయబద్ధంగా జరిగే ఏడు ప్రమాణాలకు వరుడు ఒక వినూత్నమైన '8వ వచనం' జోడించాడు. మయాంక్ అనే వరుడు చేసిన ఈ ఎనిమిదో వాగ్దానం అక్కడ ఉన్నవారికి నవ్వులు పూయించింది. వధువుతో పాటు అతిథులందరూ సరదాగా నవ్వుకున్నారు.మయాంక్, దియా జంట వివాహ బంధంతో ఒక్కటయ్యారు. సాంప్రదాయ ఏడు ప్రమాణాలను వరుడు మయాంక్ వల్లె వేశాడు. ఆ తర్వాత మైక్ తీసుకుని, మరొక వాగ్దానానికి వధువు అంగీకరించాలని కోరాడు. "ఈ రోజు నుంచి మన గదిలో ఏసీ టెంపరేచర్ ను నేనే నియంత్రిస్తాను" అని చెప్పడంతో అందరూ నవ్వుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa