AP: వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబుపై దాడిని ఖండిస్తూ తిరుపతిలో వైసీపీ శ్రేణులు భారీగా ఆందోళన చేపట్టాయి. పద్మావతి పురంలో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. భూమన కరుణాకర రెడ్డి నేతృత్వంలో ఈ నిరసన కార్యక్రమం జరిగింది. వైసీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సంఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, సీఎం చంద్రబాబు, లోకేష్ లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో అంబటిని శనివారం రాత్రి అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa