ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నాణ్యమైన నిద్రకు ఆరోగ్యకరమైన అలవాట్లివే!

Health beauty |  Suryaa Desk  | Published : Sat, Feb 07, 2026, 08:07 PM

మనిషి ఆరోగ్యానికి నాణ్యమైన ఆహారంతో పాటు సరైన నిద్ర చాలా అవసరం. ప్రస్తుత కాలంలో ఒత్తిడి, మొబైల్ వాడకం వల్ల చాలామందికి నిద్ర పట్టడం లేదు. నాణ్యమైన నిద్ర లేకపోవడం వల్ల మానసిక ఆందోళనతో పాటు దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రతిరోజూ ఒకే సమయానికి పడుకోవడం, నిద్రపోయే గదిని చీకటిగా, నిశ్శబ్దంగా ఉంచుకోవడం, నిద్రకు 2-3 గంటల ముందు తేలికపాటి ఆహారం తీసుకోవడం, మద్యం సేవించకపోవడం, ఉదయం వ్యాయామం, సూర్యరశ్మిలో ఉండటం వంటి అలవాట్లు నాణ్యమైన నిద్రకు దోహదం చేస్తాయని నిపుణులు సూచిస్తున్నారు.బెడ్ షీట్లు, దిండ్లు, పరుపులు శుభ్రం చేయడంతోపాటు, మంచం మూలలు ,పగుళ్లను విస్మరించవద్దు. ఎందుకంటే అలెర్జీలకు కారణమయ్యే దుమ్ము పురుగులు అలాంటి ప్రదేశాల్లోనే ఎక్కువగా ఉంటాయి. వాటిని శుభ్రపరచడానికి వాక్యూమ్ క్లీనర్ ఉత్తమమైంది. దీనికి బదులు మీరు తడి గుడ్డను కూడా ఉపయోగించవచ్చు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa