ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కాన్వాయ్‌కు ఈ ఉదయం స్వల్ప ప్రమాదం జరిగింది. విశాఖలోని సిరిపురం నుంచి పెద్ద వాల్తేరు వైపు వెళ్తుండగా... త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో కాన్వాయ్‌లోని ఒక వాహనం సడన్ బ్రేక్ వేయడంతో, వెనుక వచ్చిన వాహనం బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో వాహనం ముందు భాగం స్వల్పంగా దెబ్బతింది. ప్రమాద సమయంలో వాహనంలో పవన్ కల్యాణ్ లేరు. రాడిసన్ బ్లూ హోటల్ లో ఉన్న పవన్ ను పికప్ చేసుకోవడానికి వెళుతుండగా కాన్వాయ్ ప్రమాదానికి గురయింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అధికారులు, భద్రతా సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. దర్యాప్తు చేపట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa