ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చుక్క నూనె వాడకుండా అప్పడాలు, వడియాలు వేయించే చిట్కా

Recipes |  Suryaa Desk  | Published : Fri, Feb 20, 2026, 11:15 PM

వేడి వేడి అన్నంలోకి పప్పు లేదా సాంబార్ ఉంటే దాని కాంబినేషన్‌గా అప్పడాలు, వడియాలు వేయించుకుని తింటే వచ్చే టేస్టే వేరు. చాలా మంది ఇళ్లల్లో పప్పు, సాంబార్ లేదా పప్పుచారు వండినప్పుడు అప్పడాలు, వడియాలు వేయించుకుంటారు. ఇవి క్రిస్పీగా ఉండటమే కాకుండా నోటికి రుచిని అందిస్తాయి. అయితే, చాలా మంది ఇళ్లల్లో అప్పడాలు, వడియాల్ని నూనెలో వేయించుకుంటారు.


కొందరు నూనెలో వేయించిన అప్పడాలు, వడియాలు తినడానికి ఆసక్తి చూపరు. నూనెలో వేయించినవి జిడ్డుగా ఉంటాయని వాటిని తినరు. అంతేకాకుండా బయట దొరికే చిప్స్, స్నాక్స్ కూడా తినడానికి ఇష్టపడరు. అయితే, నూనె లేకుండా అప్పడాలు, వడియాలు వేయించడం కష్టం. అయితే, ఇలాంటి వారి కోసం మాస్టర్ చెఫ్ పంకజ్ బధోరియా ఓ సింపుల్ చిట్కాను చెప్పారు. ఇంటిలో ఉపయోగించే ఉప్పుతోనే అప్పడాలు, వడియాలు వేయించుకోవచ్చు. ఆ పద్ధతి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.


ఇంతకీ చిట్కా ఏంటి?


అప్పడాలు, చిప్స్, వడియాలు వేయించడానికి మనం సాధారణంగా పాన్‌లో నూనె పోస్తుంటాయి. అయితే, మీరు నూనె జోడించాల్సిన అవసరం లేదు. ముందుగా అప్పడాలు, వడియాలు, చిప్స్, గొట్టాలు వంటి వాటిని ఒక ప్లేటులోకి తీసుకోండి. ఆ తర్వాత ఒక ప్యాకెట్ ఉప్పు తీసుకోండి. మీరు వింటున్నది నిజమే.. పంకజ్ బధోరియా అప్పడాలు, వడియాల్ని ఉప్పుతో వేయించడానికి ఒక హ్యాక్‌ని పంచుకున్నారు.


ఎలా వేయించాలి?


ముందుగా పాన్‌లో ఉప్పు వేసి కొద్దిగా ఉప్పు చేయండి. గరిటె సాయంతో అటు ఇటు ఉప్పును మీడియం మంట మీద వేడి చేయండి. పాన్‌లోని ఉప్పు వేడెక్కిన తర్వాత.. దానిలో అప్పడాలు వేసి వేయించుకోండి. అప్పడాలు ఉప్పు వేడితోనే క్రిస్పీగా వేగుతాయి. ఇప్పుడు గొట్టాలు, వడియాలు కూడా వేసి వేయించండి. అయితే, వీటిని ఉప్పుతో కవర్ అయ్యేలా చూసుకుని వేయించండి.


ఆ ఉప్పు వేడికి వడియాలు, గొట్టాలు కూడా క్రిస్పీగా వేగుతాయి. మార్కెట్లో దొరికే చిప్స్‌ని కూడా ఇలాగే వేయించుకోవచ్చు. ఇక, పాన్ నుంచి తీసేటప్పుడు చేతిలో ఉప్పును షేక్ చేసి.. ఆపై వాటిని ఒక ప్లేటులోకి తీసుకోండి. నూనె వద్దనుకునేవారి.. ఉప్పులో వేయించి అప్పడాలు, వడియాలు తినొచ్చు. ఇవి తినడానికి క్రిస్పీగా ఉంటాయి.


ఇతర పద్ధతిని కూడా ట్రై చేయొచ్చు


అప్పడాలు, వడియాల్ని ఉప్పులో వేయించడంతో పాటు ఇంకొక హ్యాక్ కూడా ఉంది. అదే మైక్రోవేవ్‌ టెక్నిక్. ముందుగా అప్పడాలు, వడియాల్ని ఓవెన్‌లో ఉంచి.. ఫ్రై ఆప్షన్ సెట్ చేయండి. కొన్ని నిమిషాల్లోనే.. మీ స్నాక్స్ ఆయిల్ లేకుండా రెడీ అవుతాయి. ఎయిర్ ఫ్రైయర్స్‌లో కూడా ఈ పద్ధతిని ట్రై చేయవచ్చు. అయితే, వీటిలో రిస్క్ అనుకుంటే సాల్డ్ హ్యాక్ బాగా పనికొస్తుంది.


నూనె లేకుండా పూరీ ఎలా చేసుకోవాలి?


​మీరు నూనె వాడుకుండా జీరో ఆయిల్ పూరీ కూడా చేసుకోవచ్చు.


ఇందుకోసం ముందుగా పూరీ పిండిని పిసికి బాగా కలుపుకోండి.


ఇప్పుడు పిండి, పెరుగు, ఉప్పు, నీరు కలిపి మెత్తని పిండిని పిసికి కనీసం అరగంట పాటు పక్కన పెట్టుకోండి.


ఇప్పుడు పిండిని పూరీలుగా ఒత్తుకోండి.


దీని తర్వాత ఒక పాన్‌లో నూనెకు బదులుగా నీటిని మరిగించి నెమ్మదిగా పూరీల్ని వేయండి.


అవి నీటిపై తేలడం ప్రారంభించే వరకు దాదాపు 2 నుంచి 3 నిమిషాలు ఉడికించాలి.


ఇప్పుడు ఆ పూరీలను ఎయిర్ ఫ్రైయర్ బాస్కెట్‌లో ఉంచి 190 డిగ్రీల వద్ద 4 నుంచి 5 నిమిషాలు ఎయిర్ ఫ్రై చేయండి.


పూరీల్ని ఉంచే ముందు ఎయిర్ ఫ్రైయర్‌ను ముందుగా వేడి చేయడం మర్చిపోవద్దు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa