ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏ వయసులో నెలకు ఎంత సిప్ ఇన్వెస్ట్ చేయాలి

business |  Suryaa Desk  | Published : Mon, Feb 23, 2026, 10:48 PM

చాలా మంది సంపద సృష్టి కోసం.. పెట్టుబడుల్లో ఎక్కువగా మ్యూచువల్ ఫండ్లను ఎంచుకుంటుంటారు. ఇక్కడ అది కూడా మళ్లీ సిస్టమేటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్ వైపు చూస్తారు. అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా డేటా ప్రకారం.. 2026 జనవరిలో మ్యూచువల్ ఫండ్ సిప్ ఇన్‌ఫ్లో రూ. 31,002 కోట్లుగా ఉంది. మార్కెట్ ఒడుదొడుకులు ఉన్నప్పటికీ.. సిప్ పెట్టుబడుల వరద కొనసాగుతోంది. సిప్ అకౌంట్ల నిర్వహణలోని ఆస్తుల మొత్తం విలువ రూ. 16.36 లక్షల కోట్లకు చేరుకుంది. అయితే కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ బెనిఫిట్ వల్ల దీర్ఘకాలంలో సిప్ పెట్టుబడులతో పెద్ద మొత్తంలో సంపద సమకూరుతుందని చెబుతుంటారు. ఇక్కడ మ్యూచువల్ ఫండ్ కాలిక్యులేటర్స్ ద్వారా మనం నెలకు ఎంత సిప్ పెట్టుబడి పెడితే.. ఎన్నేళ్లకు ఎంత రాబడి అందుకోవచ్చో తెలుసుకోవచ్చు.


>> రిటైర్మెంట్ ప్రయోజనాల కోసం ఎక్కువగా మ్యూచువల్ ఫండ్లలో ఇన్వెస్ట్ చేస్తారు. మీరు ఉదాహరణకు 60 ఏళ్ల వయసుకు వచ్చే సరికి రూ. 1 కోటి అందుకోవాలనుకుంటే నెలకు సిప్ ఎంత చేయాలో చూద్దాం. ఇక్కడ సగటున వార్షిక ప్రాతిపదికన 15 శాతం అంచనా రాబడి లెక్కన లెక్కలు తెలుసుకుందాం. చాలా వరకు హై పెర్ఫామింగ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఈ మేరకు రిటర్న్స్ అందిస్తుంటాయి.


మీరు 25 ఏళ్ల వయసులో సిప్ పెట్టుబడి ప్రారంభించాలనుకుంటే.. 60 ఏళ్ల వయసు వచ్చే వరకు అంటే 35 ఏళ్ల పాటు నెలకు రూ. 1000 సిప్ ఇన్వెస్ట్ చేస్తే 15 శాతం అంచనా రాబడి లెక్కన మొత్తం రూ. 1.14 కోట్లు వస్తాయి. చిన్న వయసులోనే చేరితే.. పెట్టుబడి కాస్త తక్కువగా ఉంటుందన్నమాట.


మీరు 30 ఏళ్ల వయసులో చేరితే 60 ఏళ్ల వరకు అంటే.. మరో 30 ఏళ్ల పాటు నెలకు రూ. 2 వేల మేర సిప్ ఇన్వెస్ట్ చేస్తే.. రూ. 1.12 కోట్లు వస్తాయి. అంటే మీరు ఐదేళ్లు ఆలస్యం చేస్తే పెట్టుబడి డబుల్ అయింది.


అదే 40 ఏళ్ల వయసులో చేరినట్లయితే ఇక్కడ మరో 20 ఏళ్ల పాటు పెట్టుబడి పెట్టాలి. ఈ క్రమంలో నెలకు రూ. 7500 చొప్పున సిప్ పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఇక్కడ 15 శాతం వార్షిక రాబడి లెక్కన రూ. 1 కోటి వస్తుంది. అయితే మీరు కాస్త ఆలస్యంగా సిప్ పెట్టుబడులు ప్రారంభించాలనుకుంటే.. అప్పుడు ఏటా సిప్ మొత్తాన్ని 5 లేదా 10 శాతం చొప్పున పెంచుకుంటూ పోవాలని.. కనీసం రూ. 10 వేల చొప్పున సిప్ చేయాలని చెబుతున్నారు నిపుణులు. ఇక్కడ 45 ఏళ్ల వయసులో మీరు రూ. 10 వేల సిప్‌తో.. వార్షిక ప్రాతిపదికన 10 శాతం పెంచుకుంటూ పోతే 60 ఏళ్లు వచ్చే సరికి రూ. 1.02 కోట్లు సమకూరతాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa