ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేజ్రీవాల్ సవాల్: ఢిల్లీ అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు వెళ్లండి!

national |  Suryaa Desk  | Published : Sat, Feb 28, 2026, 02:49 PM

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కోర్టు నుంచి క్లీన్ చిట్ పొందిన వెంటనే, మాజీ సీఎం కేజ్రీవాల్ బీజేపీని ఉద్దేశించి అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలు నిర్వహించాలని సవాల్ విసిరారు. తనను, కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేశారని, అక్రమ కేసులు బనాయించారని ఆరోపించారు. మద్యం విధానం పారదర్శకంగా ఉందని, రాజకీయ కుట్రతోనే ఆమ్ ఆద్మీ పార్టీని నాశనం చేయాలని చూస్తున్నారని తెలిపారు. బీజేపీ పాలనలో ఢిల్లీ నాశనమైందని, ప్రజలు సుఖంగా లేరని వ్యాఖ్యానించారు. ఈడీ నమోదు చేసిన కేసులను రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీ కోర్టును ఆశ్రయిస్తామని కేజ్రీవాల్ తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa