ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అత్యంత పటిష్ఠమైన భద్రత కలిగిన ఇరాన్ సుప్రీం లీడర్ నివాసంని ఎలా బద్దలు కొట్టారంటే?

international |  Suryaa Desk  | Published : Sun, Mar 01, 2026, 02:17 PM

ఇరాన్ అత్యున్నత అధికార కేంద్రం ‘పాశ్చర్ స్ట్రీట్’ లోని సుప్రీం లీడర్ నివాసం అత్యంత పటిష్ఠమైన భద్రతకు మారుపేరు. అణుదాడులను కూడా తట్టుకునేలా నిర్మించిన ఆ కోటను బద్దలుకొట్టడానికి అమెరికా, ఇజ్రాయెల్ అత్యంత సంక్లిష్టమైన ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’ ని అమలు చేశాయి. ఈ దాడి ఎలా జరిగిందనే అంశం ఇప్పుడు అంతర్జాతీయ రక్షణ నిపుణులను సైతం ఆశ్చర్యపరుస్తోంది.సాధారణంగా ఏ దేశమైనా వైమానిక దాడులను శత్రువు అప్రమత్తంగా లేని అర్ధరాత్రి వేళల్లో చేపడుతుంది. కానీ, ఈసారి అమెరికా-ఇజ్రాయెల్ వ్యూహకర్తలు దీనికి భిన్నంగా పగటిపూట దాడులు ప్రారంభించారు. ఇరాన్ అధికారులు కార్యాలయాల్లో సమావేశమై ఉండే సమయాన్ని ఎంచుకుని, వారు ఊహించని విధంగా విరుచుకుపడ్డారు.టెహ్రాన్ నగరాన్ని మూడు వైపుల నుంచి చుట్టుముట్టేలా ఈ ఆపరేషన్ ప్లాన్ చేశారు. పర్షియన్ గల్ఫ్‌లో ఉన్న అమెరికా యుద్ధ నౌకలు, జలంతర్గాముల నుంచి వేలాది కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగల ‘టోమాహాక్’ క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించారు. అమెరికాకు చెందిన ఎఫ్-35 స్టీల్త్ ఫైటర్లు, బి-2 బాంబర్లు రాడార్లకు చిక్కకుండా ఇరాన్ గగనతలంలోకి ప్రవేశించి ‘పిన్ పాయింట్’ బాంబు దాడులు చేశాయి. సరిహద్దు దేశాల నుంచి హైమార్స్ రాకెట్ సిస్టమ్స్ ద్వారా ఖచ్చితమైన లక్ష్యాలపై దాడులు జరిగాయి.ఈ ఆపరేషన్‌లో అతిపెద్ద హైలైట్.. లో కాస్ట్ అన్ మ్యాన్డ్ కాంబాట్ అటాక్ సిస్టం(లుకాస్) డ్రోన్లు. అమెరికా సైన్యం తొలిసారిగా ఈ కమికేజ్ (సూసైడ్) డ్రోన్లను భారీ స్థాయిలో వాడింది. ఇరాన్ సొంతంగా తయారు చేసుకునే షాహెద్ డ్రోన్ల తరహాలో ఉండే ఈ డ్రోన్లు గుంపులుగా వచ్చి ఇరాన్ రక్షణ వ్యవస్థలైన ఎస్-300 క్షిపణులను ఏమార్చి, ఖమేనీ నివాసాన్ని నేరుగా తాకాయి. శాటిలైట్ చిత్రాల ప్రకారం.. కేవలం నిమిషాల వ్యవధిలోనే ఆ ప్రాంతమంతా శిథిలాల కుప్పగా మారిపోయింది. ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థలను పూర్తిగా నిర్వీర్యం చేసిన తర్వాతే ఈ దాడులు జరగడం విశేషం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa