సరైన మ్యూచువల్ ఫండ్‌ని ఎంచుకోవడం అనేది ఇన్వెస్టర్లకు ఒక పెద్ద ఛాలెంజ్ అనే చెప్పాలి. మార్కెట్లో వందల కొద్ది స్కీమ్స్ ఉన్నాయి. ఒక ఫండ్‌ని ఎంచుకోవాలంటే చాలా రకాల అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అందులో ఫండ్ రేటింగ్, ఎక్స్పెన్స్ రేషియో కీలక అంశాలుగా చెప్తారు. రీసర్చ్ ప్లాట్‌ఫామ్స్ నుంచి హైరెటింగ్స్ అందుకున్న ఫండ్స్, తక్కువ ఎక్స్పెన్స్ రేషియో ఉన్న ఫండ్స్ ఇన్వెస్టర్లను ఆకర్షిస్తుంటాయి. వాల్యూ రీసర్చ్ రేటింగ్స్ ప్రకారం ఎస్బీఐ మ్యూచువల ఫండ్ నుంచి పలు స్కీమ్స్ చాలా తక్కువ ఎక్స్పెన్స్ రేషియో, మంచి రేటింగ్ కలిగి ఉన్నాయి. అందులోని టాప్-5 స్కీమ్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
1.ఎస్బీఐ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫండ్
ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ నుంచి ఎస్బీఐ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫండ్ 2015, ఫిబ్రవరి 26న లాంచ్ అయింది. నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ టీఆర్ఐ బెంచ్ మార్క్‌గా ఉంటుంది. లాంచ్ అయినప్పటి నుంచి చూసుకుంటే ఈ స్కీమ్ వార్షికంగా 15.56 శాతం మేర రిటర్న్స్ ఇచ్చింది. ఈ స్కీమ్ ఎక్స్పెన్స్ రేషియో 0.72 శాతంగా ఉండగా, వాల్యూ రీసెర్చ్ రేటింగ్ 4గా ఉంది. ఇందులో రూ.1 లక్ష పెట్టుబడి పెట్టి ఉంటే ఇప్పుడు ఆ విలువ రూ. 4,90,775 అవుతుంది.
2. ఎస్బీఐ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్
ఎస్బీఐ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ ను 2013, జనవరి 1న లాంచ్ అయింది. ఈ ఓపెన్ ఎండెడ్ స్కీమ్ లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తుంది. నిఫ్టీ లార్జ్ మిడ్ క్యాప్ 250 టీఆర్ఐ బెంచ్ మార్క్ కలిగి ఉంది. ఈ స్కీమ్ లాంచ్ అయినప్పటి నుంచి చూసుకుంటే వార్షికంగా 16.73 శాతం రాబడులు అందించింది. ఈ స్కీమ్ ఎక్స్పెన్స్ రేషియో 0.72 శాతంగా ఉండగా, 4 స్టార్ రేటింగ్ కలిగి ఉన్నాయి. ఇందులో రూ.1 లక్ష ఇన్వెస్ట్ చేస్తే ఈ 13 ఏళ్లలో రూ.7,47,089 అవుతుంది.
3. ఎస్బీఐ కాంట్రా ఫండ్
ఎస్బీఐ ఏఎంసీ నుంచి 2013, జనవరి 1వ తేదీనే ఎస్బీఐ కాంట్రా ఫండ్ లాంచ్ అయింది. ఈ స్కీమ్ బీఎస్ఈ 500 టీఆర్ఐ బెంచ్ మార్క్ కలిగి ఉంది. ఈ స్కీమ్ లాంచ్ అయినప్పటి నుంచి చూసుకుంటే వార్షికంగా 15.81 శాతం రాబడులు ఇచ్చింది. ఈ స్కీమ్ ఎక్స్పెన్స్ రేషియో 0.73 శాతంతో 5 స్టార్ రేటింగ్ కలిగి ఉంది. ఇందులో రూ.1 లక్ష పెట్టుబడి పెట్టి ఉంటే ఈ 13 ఏళ్లలో రూ. 6,74,060 అవుతుంది.
4. ఎస్బీఐ ఫోకస్డ్ ఫండ్
ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ 2013, జనవరి 1వ తేదీనే ఎస్బీఐ ఫోకస్డ్ ఫండ్ లాంచ్ చేసింది. ఈ స్కీమ్ బెంచ్ మార్క్ బీఎస్ఈ 500 టీఆర్ఐగా ఉంది. ఈ స్కీమ్ లాంచ్ అయినప్పటి నుంచి వార్షికంగా 15.37 శాతం రాబడులు ఇచ్చింది. ఈ స్కీమ్ ఎక్స్పెన్స్ రేషియోల 0.73 శాతంగా ఉండగా, 4 స్టార్ రేటింగ్ కలిగి ఉంది. ఇందులో రూ.1 లక్ష ఇన్వెస్ట్ చేసిన వారికి ఇప్పుడు ఆ విలువ రూ. 6,41,516 అవుతుంది.
5. ఎస్బీఐ లార్జ్ క్యాప్ ఫండ్
ఎస్బీఐ ఏఎంసీ నుంచి ఎస్బీఐ లార్జ్ క్యాప్ ఫండ్ సైతం 2013, జనవరి 1వ తేదీనే లాంచ్ అయింది. ఈ స్కీమ్ బీఎస్ఈ 100 టీఆర్ఐ బెంచ్ మార్క్ కలిగి ఉంది. లాంచ్ అయినప్పటి నుంచి చూసుకుంటే వార్షికంగా 14.58 శాతం రాబడులు ఇచ్చింది. ఈ స్కీమ్ ఎక్స్పెన్స్ రేషియో 0.79 శాతంగా ఉండగా 4 స్టార్ రేటింగ్ కలిగి ఉంది. ఈ స్కీమ్ లాంచ్ అయినప్పుడు రూ.1 లక్ష పెట్టుబడి పెట్టి ఉంటే ఆ విలువ రూ. 5,86,698 అవుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa