ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ రాష్ట్రంలో గ్యాస్ సరఫరా, వినియోగానికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. గ్యాస్ సిలిండర్ల బుకింగ్ ఇకపై తప్పనిసరిగా ఆన్లైన్ ద్వారానే జరగాలని, దీనివల్ల బ్లాక్ మార్కెటింగ్‌ను సమర్థవంతంగా అరికట్టవచ్చని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే 88 శాతం మంది వినియోగదారులు ఓటీపీ ద్వారా సిలిండర్లు తీసుకుంటున్నారని, ఎవరైనా అక్రమాలకు పాల్పడితే ప్రభుత్వం, గ్యాస్ కంపెనీలు కఠిన చర్యలు తీసుకుంటాయని హెచ్చరించారు. గ్యాస్ దుర్వినియోగాన్ని అరికట్టేందుకు పట్టణ ప్రాంతాల్లో 25 రోజులు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజుల గడువు విధించినట్టు తెలిపారు. డబుల్ సిలిండర్ ఉన్న వారికి 32 రోజుల చొప్పున రీఫిల్ బుకింగ్‌పై పరిమితి విధించినట్లు మంత్రి వివరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa