ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్టువర్ట్ ఆ జెర్సీని చెత్తకుండీలో పడేశాడు: యువరాజ్

sports |  Suryaa Desk  | Published : Fri, Apr 10, 2026, 02:05 PM

టీ20 ప్రపంచకప్ 2007లో ఇంగ్లండ్‌పై యువరాజ్ సింగ్ ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు కొట్టి చరిత్ర సృష్టించాడు. అప్పుడు బౌలర్‌గా ఉన్న స్టువర్ట్ బ్రాడ్ ఈ ఘోరమైన అనుభవాన్ని ఎదుర్కొన్నాడు. తాజాగా యువరాజ్ సింగ్ ఈ సంఘటనను గుర్తు చేసుకున్నాడు. స్టువర్ట్ బ్రాడ్ తండ్రి, అంపైర్ క్రిస్ బ్రాడ్, తన కుమారుడి కెరీర్ నాశనం చేశావని యువరాజ్ తో అన్నాడు. యువరాజ్ తన టీమిండియా జెర్సీపై సంతకం చేసి క్రిస్ బ్రాడ్ కు ఇచ్చాడు, దానిపై 'ఒకే ఓవర్లో ఐదు సిక్సర్లు సమర్పించుకున్న ఆటగాడిగా నాకూ అనుభవం ఉంది. అయితే, నువ్వు ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్‌గా ఎదుగుతావు' అని రాశాడు. అయితే స్టువర్ట్ ఆ జెర్సీని చెత్తకుండీలో పడేశాడని ఇటీవల చదివానని, కోపంలో ఆ పని చేసి ఉంటాడని యువరాజ్ పేర్కొన్నాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa