తల్లులు తమ పిల్లలకు ఏం తినిపించాలనే దానిపై ఎంతో ఆలోచిస్తారు. 'పలానా ఆహారం పడకపోతే' అనే భయంతో రెగ్యులర్ డైట్ నే అనుసరిస్తుంటారు. అయితే ఏడాది దాటిన పిల్లలకు గుడ్డు పెట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. కోడిగుడ్డులో విటమిన్-బి12, విటమిన్-డి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి పిల్లలను ఫిట్ గా, యాక్టివ్ గా ఉంచడమే కాకుండా మెదడు అభివృద్ధికి తోడ్పడతాయి. అమెరికన్ జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్ స్టడీ ప్రకారం, తొమ్మిది నెలల నుంచే పిల్లలకు గుడ్డు పెట్టడం వల్ల వారి ఏకాగ్రత పెరుగుతుందని తెలుస్తోంది. వాషింగ్టన్ యూనివర్సిటీ పరిశోధన ప్రకారం, ఏడు నుంచి తొమ్మిది నెలల మధ్య పిల్లల ఆహారంలో గుడ్డును చేర్చడం వల్ల వారు త్వరగా ఎదుగుతారని తేలింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa