ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అత్యద్భుతమైన శక్తి గల ఆలయం మురడి ఆంజనేయస్వామి దేవాలయం

Bhakthi |  Suryaa Desk  | Published : Thu, Jun 16, 2022, 11:56 AM

రాయలసీమ అనంతపురం జిల్లాలో వెలసిన శ్రీఆంజనేయస్వామి దేవస్థానం మురడి అత్యద్భుతమైన శక్తి గల ఆంజనేయ స్వామి దేవస్థానం. కసాపురం తరువాత ప్రపంచ వ్యాప్తంగా అంత ఖ్యాతి గల దివ్య క్షేత్రమే మురడి. శ్రీ వ్యాస రాయులు ఒకే ముహూర్తం లో మూడు చోట్ల విగ్రహ ప్రతిష్టాపణ చేశారు. ఒకటి శ్రీకసాపురం ఆంజనేయ స్వామి దేవస్థానం, గుంతకల్లు దగ్గర. శ్రీ మురిడి ఆంజనేయ స్వామి దేవస్థానం మరియు శ్రీ నేమకల్లు ఆంజనేయస్వామి దేవస్థానం రాయదుర్గం దగ్గర. ఈ మూడు దేవస్థానాలు ఒకే జిల్లా లో ఉండటం విశేషం. ఈ ఆలయాలను క్రీ. పూ 450 సంవత్సరంలో ఆలయాలను నిర్మించినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. ఒకే నక్షత్రంలో ప్రతిష్టించిన శ్రీఆంజనేయస్వామి ఆలయాలను పవిత్రమైన శ్రావణ మాసంలో మంగళ, శనివారాల్లో దర్శిస్తే మంచి జరుగుతుందని భక్తులు పేర్కొంటున్నారు. ఇక్కడ స్వామి వారు మూడు అడుగులు ఉండటం చేత మురడి అని పేరు వచ్చింది. కన్నడం లో మురడి అంటే మూడు అడుగులు అని అర్ధం. ఆలయ రాజా గోపురం చాల బాగుంటుంది గోపురం లో హనుమంతుడు చుట్టూ రామాయణ గాద సంబందించిన చిత్రాలను మనం చూడవచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com