BREAKING
ఐదేళ్లలో ఎన్నో సాధించాం.. ప్ర‌జా సేవ‌లో అంకితభావంతో పని చేశాం జూరాల నీటిపై బీఆర్‌ఎస్‌ రాజకీయ హడావుడి : మంత్రులు 'ధురంధర్' విజయంతో సారా అర్జున్‌కు పెరిగిన క్రేజ్.. మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్! ఆసియా క్రీడల్లో భారత మహిళల క్రికెట్ జట్టు సరికొత్త చరిత్ర: అదిరిపోయే ఆటతీరుతో భారత్‌కు తొలి స్వర్ణ పతకం పిడుగుపాటుకు 25 గొర్రెలు మృతి… భారీ పెట్టుబడి మోసం కేసును ఛేదించిన కరీంనగర్ పోలీసులు 'రణబలి' నుంచి 'ఏందయ్యా సామి' ఫుల్ సాంగ్ విడుదల.. శ్రోతలను ఆకట్టుకుంటున్న మాస్ మెలోడీ! మంత్రి ఉత్తమ్ పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు కడప జిల్లాను కరువు జిల్లా గా ప్రకటించాలి ఉద్యమకారులకు ప్రజా ప్రభుత్వం అండ: సీఎం రేవంత్ రెడ్డి కేదారి-పుష్పలత కుటుంబానికి రూ. 10 లక్షల ఆర్థిక సాయం ప్రకటన 'ఇట్లు అర్జున' ఈవెంట్‌లో వింత ప్రశ్న.. అనస్వర రాజన్ క్యూట్ రియాక్షన్ వైరల్! 8వేల ఎకరాలపై శ్వేతపత్రం విడుదల చేయాలి. గణనాథుని సేవలో పోలీసు అధికారులు: 'అడకిత్త' మూవీ రివ్యూ.. సస్పెన్స్ త్రిల్లర్ డ్రామా ఎలా ఉందంటే? రేపు సూర్యాపేట జిల్లా తిరుమలగిరికి రానున్న మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి -దాదాపు రూ.74.50 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు

రాజకీయాలకు అతీతంగా ప్రజా సేవ.

Select Suryaa Now
రాజకీయాలకు అతీతంగా ప్రజా సేవ.

కళ్యాణదుర్గం టౌన్ మేజర్ న్యూస్ :అనారోగ్యంతో బాధపడుతున్న యువతికి మెరుగైన వైద్యం అందించేందుకు అండగా ఉంటానని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు మూడు రోజుల్లోనే ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ.3.50 లక్షల ఎల్ఓసీని మంజూరు చేయించారు. పార్టీలకు అతీతంగా ప్రజల కష్టాల్లో అండగా నిలవడమే తన ధ్యేయమని ఎమ్మెల్యే మరోసారి చాటుకున్నారు. వైసీపీకి చెందిన ముఖ్య నాయకుడి కుమార్తె వైద్యానికి సైతం స్పందించి సహాయం అందించడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

అనారోగ్యంతో బాధపడుతున్న పవిత్ర.

కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని దొడగట్ట గ్రామానికి చెందిన వైసీపీ ముఖ్య నాయకుడి కుమార్తె పవిత్ర కొంతకాలంగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రిలో చికిత్స పొందాల్సి ఉండగా, అందుకు అయ్యే ఖర్చును భరించే స్థోమత కుటుంబానికి ఇబ్బందిగా మారింది. ఈ విషయం గ్రామస్థులు, కుటుంబ సభ్యుల ద్వారా ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు దృష్టికి వెళ్లింది.

హామీ ఇచ్చిన వెంటనే చర్యలు.

పవిత్ర ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్న ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పడంతో పాటు, వైద్యం కోసం అవసరమైన సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు. సమస్యను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి ఆర్థిక సాయం అందేలా చర్యలు తీసుకున్నారు. హామీ ఇచ్చిన మూడు రోజుల్లోనే రూ.3,50,000 విలువైన ఎల్ఓసీ మంజూరు కావడంతో కుటుంబ సభ్యులు ఊరట చెందారు.

అమరావతిలో కుటుంబ సభ్యులకు అందజేత.

ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన రూ.3.50 లక్షల ఎల్ఓసీ పత్రాలను సోమవారం అమరావతిలోని అసెంబ్లీ వద్ద పవిత్ర కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అందజేశారు. ఈ సందర్భంగా యువతి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే, మెరుగైన వైద్యం చేయించుకోవాలని సూచించారు. అవసరమైతే భవిష్యత్తులోనూ తన వంతు సహకారం అందిస్తానని కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు.

ప్రజల సమస్యలు, ఆపద సమయంలో రాజకీయాలను పక్కనపెట్టి మానవతా దృక్పథంతో స్పందించడమే ప్రజాప్రతినిధిగా తన బాధ్యత అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఎవరు ఏ పార్టీకి చెందిన వారైనా, కష్టాల్లో ఉన్నప్పుడు వారికి అండగా నిలవాలన్నదే తన ఉద్దేశమని స్పష్టం చేశారు. వైసీపీ నాయకుడి కుటుంబానికి చెందిన యువతి వైద్యానికి సైతం చొరవ తీసుకుని సీఎం సహాయనిధి అందేలా చర్యలు తీసుకోవడం ఎమ్మెల్యే రాజకీయాలకు అతీతంగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయానికి బలం చేకూర్చింది.

పవిత్రకు మెరుగైన వైద్యం అందించేందుకు రూ.3.50 లక్షల ఆర్థిక సాయం మంజూరు చేయించడంపై కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వ సహాయంతో పవిత్రకు మెరుగైన వైద్యం అందించి ఆరోగ్యంగా ఇంటికి తీసుకురావాలని కుటుంబ సభ్యులు ఆకాంక్షించారు.