BREAKING
కొండగట్టు అంజన్నను దర్శించుకున్న హైడ్రా కమీషనర్ “క్షమాపణ చెప్తారనుకున్నా.. డైవర్షన్ చేస్తున్నారు” కెసిఆర్ మరణాన్ని కోరడం ఎమ్మెల్యే స్థాయికి తగదు విజయవాడ దుర్గగుడి బోర్డులో సుస్మిత కొణిదెల నియామకం: ఆధ్యాత్మిక వర్గాల్లో జోరుగా చర్చ! ఖబర్ధార్ శంకర్.! రాష్ట్రానికి పట్టిన పీడ కేసీఆర్ ప్రతిరోజూ ప్రోటీన్ కావాలా? ఈ ఆహారాలను మీ డైట్‌లో చేర్చుకోండి! వేములవాడలో అఖండ భక్తజనం.. దేవాలయ చరిత్రలో ఘననీయమైన ఆదాయం.. శ్రీ భీమేశ్వర స్వామివారిని దర్శించుకున్న 1,05,600 మంది భక్తులు.. రోజూ ఎంతసేపు నడిస్తే ఆరోగ్యానికి మంచిది? ఆయుర్దాయం పెంచే అద్భుతమైన మార్గం! ‘అరసన్’ సినిమాపై శింబు ఆసక్తికర వ్యాఖ్యలు: అంచనాలు పెంచేస్తున్న గ్యాంగ్‌స్టర్ డ్రామా! దళిత నాయకున్ని అవమానిస్తే చూస్తూ ఊరుకోము:.... రణరంగాన్ని తలపించిన పటాన్‌చెరు -కాంగ్రెస్‌ వర్సెస్‌ బీఆర్‌ఎస్‌ పోటాపోటీ ధర్నాలు సత్య నికేతన్ భవన కూల్చివేత దుర్ఘటన అసెంబ్లీలో గుండెపోటుతో పడిపోయిన ఐఏఎస్ అధికారి పీఎస్‌కు మంత్రి వకిటి శ్రీహరి సీపీఆర్ ఏపీలో వారం రోజులుగా CRS సేవలు బంద్

తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదు -మాజీ కార్పొరేటర్ శ్రీనివాసులు

Select Suryaa Now
తప్పుడు ఆరోపణలు  చేస్తే సహించేది లేదు -మాజీ కార్పొరేటర్ శ్రీనివాసులు
అనంతపురం రూరల్ మేజర్ న్యూస్:   భూకబ్జాల పేరుతో .. తన పై తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదని 48వ డివిజన్  మాజీ  కార్పొరేటర్  శ్రీనివాసులు హెచ్చరించారు. సోమవారం స్థానిక వైసీపీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 48వ డివిజన్ నుంచి ఇటీవలే టిడిపిలో చేరిన మోహన్ , ఇతరులు అనవసర, లేనిపోని ఆరోపణలతో.. తనపై బురదజల్లే ప్రయత్నంను మానుకోవాలన్నారు. నీవు చెప్పేది శ్రీరంగా నీతులు, చేసే వేదవ పనులన్నీ డివిజన్ ప్రజలందరికీ తెలుసు అన్నారు. నీ చరిత్ర ఏ పోలీస్ స్టేషన్లో రికార్డులు, భూకబ్జా బాధితుల వివరాలు అడిగితే  చాలు చెబుతారన్నారు. నాపై వస్తున్న భూకబ్జా ఆరోపణలపై బహిరంగ చర్చకు సిద్ధమా అని శ్రీనివాసులు సవాల్ చేశారు. నగరపాలక సంస్థ  పూడికతీత పనులను చేపడితే... సొంత డబ్బుతో చేసినట్లు ప్రచారం ప్రచారం చేసుకుంటున్నావు సిగ్గు లేదా అని ప్రశ్నించారు. 48వ డివిజన్ తో  సంబంధం లేకపోయినా.. ఏళ్ల తరబడి ఇక్కడే నివాసం ఉన్నట్లు... ప్రజా సమస్యలపై మాట్లాడడం హాస్యస్పదమన్నారు.  ఇటీవలే నిర్వహించిన కార్యక్రమానికి కాలనీలో ఎవరు ఎవరితో ఎంతెంత వసూలు చేశావో.. సమాధానం చెప్పాలన్నారు. ఇలాంటి వ్యక్తిని ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రోత్సహించడం చూసి.. అమ్మో అని ప్రజలు భయపడుతున్నారని శ్రీనివాసులు విమర్శించారు.  ప్రజాసేవ పేరుతో రాజకీయాల్లోకి వచ్చి.. ప్రజల్ని భయపెట్టే పరిస్థితికి రావద్దని ఆయన హెచ్చరించారు. డివిజన్ ప్రజలకు ఎవరి చరిత్ర ఏమిటో అంతా తెలుసునన్నారు.  ఈ కార్యక్రమంలో వైసిపి మహిళా నాయకురాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా కార్యదర్శి ప్రసన్న లక్ష్మి , నగర మహిళా కార్యదర్శి సైలజ, యూత్ లీడర్ శ్రీకాంత్ , ట్రేడ్ యూనియన్ నగర సెక్రటరీ రహమతుల్లా,   డివిజన్ బీసీ సెల్ నాయకులు హరికృష్ణ పాల్గొన్నారు.