BREAKING
విజయవాడ దుర్గగుడి బోర్డులో సుస్మిత కొణిదెల నియామకం: ఆధ్యాత్మిక వర్గాల్లో జోరుగా చర్చ! ఖబర్ధార్ శంకర్.! రాష్ట్రానికి పట్టిన పీడ కేసీఆర్ ప్రతిరోజూ ప్రోటీన్ కావాలా? ఈ ఆహారాలను మీ డైట్‌లో చేర్చుకోండి! వేములవాడలో అఖండ భక్తజనం.. దేవాలయ చరిత్రలో ఘననీయమైన ఆదాయం.. శ్రీ భీమేశ్వర స్వామివారిని దర్శించుకున్న 1,05,600 మంది భక్తులు.. రోజూ ఎంతసేపు నడిస్తే ఆరోగ్యానికి మంచిది? ఆయుర్దాయం పెంచే అద్భుతమైన మార్గం! ‘అరసన్’ సినిమాపై శింబు ఆసక్తికర వ్యాఖ్యలు: అంచనాలు పెంచేస్తున్న గ్యాంగ్‌స్టర్ డ్రామా! దళిత నాయకున్ని అవమానిస్తే చూస్తూ ఊరుకోము:.... రణరంగాన్ని తలపించిన పటాన్‌చెరు -కాంగ్రెస్‌ వర్సెస్‌ బీఆర్‌ఎస్‌ పోటాపోటీ ధర్నాలు సత్య నికేతన్ భవన కూల్చివేత దుర్ఘటన అసెంబ్లీలో గుండెపోటుతో పడిపోయిన ఐఏఎస్ అధికారి పీఎస్‌కు మంత్రి వకిటి శ్రీహరి సీపీఆర్ ఏపీలో వారం రోజులుగా CRS సేవలు బంద్ భారతదేశపు 'బంగారు పీచు' జనపనార ఢిల్లీ వేదికగా 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు స్వచ్ఛమైన గాలి దిశగా భారత్ అడుగులు

గాంధీ, నెహ్రూపైనా కేసులు పెట్టండి

Select Suryaa Now
గాంధీ, నెహ్రూపైనా కేసులు పెట్టండి

కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వందేమాతరం వివాదంపై తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్‌ నేతలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీపై ఫిర్యాదు చేయడాన్ని ప్రశ్నించారు. తాము పాడిన వందేమాతరం కొత్తది కాదని చెప్పారు. మహాత్మాగాంధీ, జవహర్‌లాల్‌ నెహ్రూ పాడినదే తామూ పాడామని స్పష్టం చేశారు. అది నేరమైతే వారిపైనా కేసులు పెట్టాలని వ్యాఖ్యానించారు. ఆగస్టు 15న కాంగ్రెస్‌ ప్రధాన కార్యాలయంలో వందేమాతరం ఆలాపనపై వివాదం మొదలైంది. ఖర్గే జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన తర్వాత వందేమాతరం ఆలపించారు. అయితే పార్టీ నిర్ణయం ప్రకారం తొలి రెండు చరణాలతో ముగించాల్సిన గేయాన్ని పూర్తిగా ఆలపించారు. గాయకులు కొనసాగించడాన్ని సోనియా గాంధీ గమనించి వారిని ఆపేందుకు ప్రయత్నించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ఘటనపై సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీపై ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు అందింది. వందేమాతరం ఆలాపనను అడ్డుకునేందుకు ప్రయత్నించారంటూ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని ఫిర్యాదుదారు కోరారు. దీనిపై ఖర్గే స్పందిస్తూ.. గత 18 ఏళ్లుగా కాంగ్రెస్‌ పాడుతున్న వందేమాతరం గీతాన్నే తాజాగా కూడా ఆలపించామని చెప్పారు. అటల్‌ బిహారీ వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న సమయంలో కేంద్ర ప్రభుత్వం కూడా ఇదే గేయాన్ని ఆలపించిందని గుర్తుచేశారు. వందేమాతరం విషయంలో కాంగ్రెస్‌ ఎప్పుడో తీర్మానం చేసిందని ఖర్గే తెలిపారు. భవిష్యత్తులో మరో ప్రభుత్వం వస్తే, వారు ఏ నిర్ణయం తీసుకుంటే అది అందరూ పాటించాలా? అని ప్రశ్నించారు.