BREAKING
డార్లింగ్ పుట్టినరోజున ‘స్పిరిట్’ నుంచి అదిరిపోయే ట్రీట్: సాలిడ్ యాక్షన్ గ్లింప్స్‌కు రంగం సిద్ధం! కొండగట్టు అంజన్నను దర్శించుకున్న హైడ్రా కమీషనర్ “క్షమాపణ చెప్తారనుకున్నా.. డైవర్షన్ చేస్తున్నారు” కెసిఆర్ మరణాన్ని కోరడం ఎమ్మెల్యే స్థాయికి తగదు విజయవాడ దుర్గగుడి బోర్డులో సుస్మిత కొణిదెల నియామకం: ఆధ్యాత్మిక వర్గాల్లో జోరుగా చర్చ! ఖబర్ధార్ శంకర్.! రాష్ట్రానికి పట్టిన పీడ కేసీఆర్ ప్రతిరోజూ ప్రోటీన్ కావాలా? ఈ ఆహారాలను మీ డైట్‌లో చేర్చుకోండి! వేములవాడలో అఖండ భక్తజనం.. దేవాలయ చరిత్రలో ఘననీయమైన ఆదాయం.. శ్రీ భీమేశ్వర స్వామివారిని దర్శించుకున్న 1,05,600 మంది భక్తులు.. రోజూ ఎంతసేపు నడిస్తే ఆరోగ్యానికి మంచిది? ఆయుర్దాయం పెంచే అద్భుతమైన మార్గం! ‘అరసన్’ సినిమాపై శింబు ఆసక్తికర వ్యాఖ్యలు: అంచనాలు పెంచేస్తున్న గ్యాంగ్‌స్టర్ డ్రామా! దళిత నాయకున్ని అవమానిస్తే చూస్తూ ఊరుకోము:.... రణరంగాన్ని తలపించిన పటాన్‌చెరు -కాంగ్రెస్‌ వర్సెస్‌ బీఆర్‌ఎస్‌ పోటాపోటీ ధర్నాలు సత్య నికేతన్ భవన కూల్చివేత దుర్ఘటన అసెంబ్లీలో గుండెపోటుతో పడిపోయిన ఐఏఎస్ అధికారి పీఎస్‌కు మంత్రి వకిటి శ్రీహరి సీపీఆర్

లైవ్ టీవీలో సంజయ్ మంజ్రేకర్, మురళీ కార్తీక్ మధ్య వ్యాఖ్యల యుద్ధం

Select Suryaa Now
లైవ్ టీవీలో సంజయ్ మంజ్రేకర్, మురళీ కార్తీక్ మధ్య వ్యాఖ్యల యుద్ధం

్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ సందర్భంగా లైవ్ కామెంట్‌రీ బాక్స్   స్టూడియో మధ్య చోటుచేసుకున్న సరదా సంభాషణ కాస్తా వాడివేడి వివాదంగా మారింది. భారత మాజీ క్రికెటర్లు సంజయ్ మంజ్రేకర్, మురళీ కార్తిక్ ఆన్ ఎయిర్ లైవ్ షోలో ఒకరిపై ఒకరు చేసుకున్న వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

వివరాల్లోకి వెళితే... టెస్టు మ్యాచ్ లంచ్ బ్రేక్ సమయంలో, స్టూడియోలో ఉన్న మురళీ కార్తిక్ మైదానం వద్ద నుండి మాట్లాడుతున్న సంజయ్ మంజ్రేకర్ ముఖకవళికలపై కామెంట్ చేశారు. "మీరు పెట్టే ఎక్స్ ప్రెషన్స్ వల్ల మీరు ఏం మాట్లాడుతున్నారో ఒక్కోసారి సరిగా అర్థం కావడం లేదు, అది కొంచెం తగ్గించండి" అంటూ కార్తిక్ సరదాగా వ్యాఖ్యానించారు.  

దీంతో అసహనానికి గురైన సంజయ్ మంజ్రేకర్ వెంటనే స్పందిస్తూ.. "కెమెరాను నా నుంచి స్ప్లిట్ స్క్రీన్ చేసి పక్కనే ఉన్న అజింక్య రహానే వైపు తిప్పండి, ఆయన ముఖం చూడటానికి చాలా బాగుంటుంది, మాట్లాడటానికి కూడా మంచి వ్యక్తి" అని కౌంటర్ ఇచ్చారు. అంతేకాకుండా మురళీ కార్తిక్ అద్దంలో చూసుకుంటూ తనను తాను చూసి మురిసిపోతుంటారని ఎద్దేవా చేశారు. దానికి కార్తిక్ "నేను అద్దంలో చూసుకోను, అది మీ అలవాటే" అని రీకౌంటర్ ఇచ్చారు.

వాతావరణం కాస్త సీరియస్‌గా మారుతుండటంతో, మంజ్రేకర్ "మనం హద్దులు దాటి మాట్లాడుకుంటే సోషల్ మీడియాకి మంచి కంటెంట్ దొరుకుతుంది" అని వ్యాఖ్యానించి నవ్వుతూ పరిస్థితిని సర్దుబాటు చేసే ప్రయత్నం చేశారు.