BREAKING
విజయవాడ దుర్గగుడి బోర్డులో సుస్మిత కొణిదెల నియామకం: ఆధ్యాత్మిక వర్గాల్లో జోరుగా చర్చ! ఖబర్ధార్ శంకర్.! రాష్ట్రానికి పట్టిన పీడ కేసీఆర్ ప్రతిరోజూ ప్రోటీన్ కావాలా? ఈ ఆహారాలను మీ డైట్‌లో చేర్చుకోండి! వేములవాడలో అఖండ భక్తజనం.. దేవాలయ చరిత్రలో ఘననీయమైన ఆదాయం.. శ్రీ భీమేశ్వర స్వామివారిని దర్శించుకున్న 1,05,600 మంది భక్తులు.. రోజూ ఎంతసేపు నడిస్తే ఆరోగ్యానికి మంచిది? ఆయుర్దాయం పెంచే అద్భుతమైన మార్గం! ‘అరసన్’ సినిమాపై శింబు ఆసక్తికర వ్యాఖ్యలు: అంచనాలు పెంచేస్తున్న గ్యాంగ్‌స్టర్ డ్రామా! దళిత నాయకున్ని అవమానిస్తే చూస్తూ ఊరుకోము:.... రణరంగాన్ని తలపించిన పటాన్‌చెరు -కాంగ్రెస్‌ వర్సెస్‌ బీఆర్‌ఎస్‌ పోటాపోటీ ధర్నాలు సత్య నికేతన్ భవన కూల్చివేత దుర్ఘటన అసెంబ్లీలో గుండెపోటుతో పడిపోయిన ఐఏఎస్ అధికారి పీఎస్‌కు మంత్రి వకిటి శ్రీహరి సీపీఆర్ ఏపీలో వారం రోజులుగా CRS సేవలు బంద్ భారతదేశపు 'బంగారు పీచు' జనపనార ఢిల్లీ వేదికగా 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు స్వచ్ఛమైన గాలి దిశగా భారత్ అడుగులు

కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తో ఏపీ జితేందర్ రెడ్డి భేటీ

Select Suryaa Now
కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తో ఏపీ జితేందర్ రెడ్డి భేటీ

హైదరాబాద్–బెంగళూరు రక్షణ పారిశ్రామిక కారిడార్‌కు ఆమోదం తెలపాలని వినతి 
కేంద్ర ప్రభుత్వ రక్షణ, ఏరోస్పేస్ కారిడార్‌గా అధికారికంగా ప్రకటించాలని డిమాండ్ 
ఉత్తరప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో ఇప్పటికే ఏర్పాటు చేసిన రక్షణ కారిడార్లు 
వాటితో సమానంగా దీనికి ప్రాధాన్యం, ప్రోత్సాహం కల్పించాలని సూచన 

తెలంగాణ బ్యూరో ప్రతినిధి : తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, క్రీడా వ్యవహారాల సలహాదారు  ఏపీ జితేందర్ రెడ్డి నేడు న్యూఢిల్లీలోని కేంద్ర రక్షణ శాఖ మంత్రి  రాజ్‌నాథ్ సింగ్ అధికారిక నివాసంలో ఆయనను కలిశారు. ఈ సమావేశంలో ఏపీ జితేందర్ రెడ్డి వెంట ఖమ్మం ఎంపీ  ఆర్. రఘురాం రెడ్డి, మహబూబాబాద్ ఎంపీ  బలరాం నాయక్ ఉన్నారు. హైదరాబాద్–బెంగళూరు రక్షణ పారిశ్రామిక కారిడార్‌ను కేంద్ర ప్రభుత్వ రక్షణ, ఏరోస్పేస్ కారిడార్‌గా అధికారికంగా ప్రకటించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి చేసిన విజ్ఞప్తిని ఈ సందర్భంగా జితేందర్ రెడ్డి పునరుద్ఘాటించారు. ఉత్తరప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో ఇప్పటికే ఏర్పాటు చేసిన రక్షణ కారిడార్లతో సమానంగా దీనికి ప్రాధాన్యం, ప్రోత్సాహం కల్పించాలని కోరారు. దేశంలోని అతిపెద్ద ఏరోస్పేస్, రక్షణ రంగ కేంద్రాల్లో హైదరాబాద్ ఒకటని ఆయన కేంద్ర మంత్రికి వివరించారు. హైదరాబాద్‌లో డజనుకు పైగా ప్రధాన రక్షణ రంగ ప్రభుత్వ సంస్థలు, వ్యూహాత్మక డీఆర్‌డీఓ ప్రయోగశాలలతోపాటు 1,500కు పైగా ఏరోస్పేస్, రక్షణ రంగ ఎంఎస్‌ఎంఈలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని తెలిపారు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ నుంచి ఏరోస్పేస్, రక్షణ రంగ ఎగుమతులు 100 శాతం వృద్ధి నమోదు చేశాయని పేర్కొన్నారు. ప్రతిపాదిత కారిడార్‌తో స్వదేశీ రక్షణ ఉత్పత్తి వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని, పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలు వేగవంతమవుతాయని జితేందర్ రెడ్డి తెలిపారు. మౌలిక సదుపాయాల కల్పన, సామర్థ్యాభివృద్ధికి ఇది దోహదపడటంతోపాటు దేశ రక్షణ సన్నద్ధతకు, ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమానికి గణనీయమైన తోడ్పాటునందిస్తుందని వివరించారు. ఈ విజ్ఞప్తిపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సానుకూలంగా స్పందించారు. ప్రతిపాదనను తగిన విధంగా పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.