BREAKING
కొండగట్టు అంజన్నను దర్శించుకున్న హైడ్రా కమీషనర్ “క్షమాపణ చెప్తారనుకున్నా.. డైవర్షన్ చేస్తున్నారు” కెసిఆర్ మరణాన్ని కోరడం ఎమ్మెల్యే స్థాయికి తగదు విజయవాడ దుర్గగుడి బోర్డులో సుస్మిత కొణిదెల నియామకం: ఆధ్యాత్మిక వర్గాల్లో జోరుగా చర్చ! ఖబర్ధార్ శంకర్.! రాష్ట్రానికి పట్టిన పీడ కేసీఆర్ ప్రతిరోజూ ప్రోటీన్ కావాలా? ఈ ఆహారాలను మీ డైట్‌లో చేర్చుకోండి! వేములవాడలో అఖండ భక్తజనం.. దేవాలయ చరిత్రలో ఘననీయమైన ఆదాయం.. శ్రీ భీమేశ్వర స్వామివారిని దర్శించుకున్న 1,05,600 మంది భక్తులు.. రోజూ ఎంతసేపు నడిస్తే ఆరోగ్యానికి మంచిది? ఆయుర్దాయం పెంచే అద్భుతమైన మార్గం! ‘అరసన్’ సినిమాపై శింబు ఆసక్తికర వ్యాఖ్యలు: అంచనాలు పెంచేస్తున్న గ్యాంగ్‌స్టర్ డ్రామా! దళిత నాయకున్ని అవమానిస్తే చూస్తూ ఊరుకోము:.... రణరంగాన్ని తలపించిన పటాన్‌చెరు -కాంగ్రెస్‌ వర్సెస్‌ బీఆర్‌ఎస్‌ పోటాపోటీ ధర్నాలు సత్య నికేతన్ భవన కూల్చివేత దుర్ఘటన అసెంబ్లీలో గుండెపోటుతో పడిపోయిన ఐఏఎస్ అధికారి పీఎస్‌కు మంత్రి వకిటి శ్రీహరి సీపీఆర్ ఏపీలో వారం రోజులుగా CRS సేవలు బంద్

ఈసీ లక్షలాది ఓట్లను తొలగించింది: మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపణ

Select Suryaa Now
ఈసీ లక్షలాది ఓట్లను తొలగించింది: మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపణ

తెలంగాణలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (సర్) ప్రక్రియలో భాగంగా ఎన్నికల సంఘం (ఈసీ) విచక్షణారహితంగా లక్షలాది ఓట్లను తొలగించిందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తీవ్ర ఆరోపణలు చేశారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ముసాయిదా ఓటరు జాబితా విడుదలైన అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరంలోని బూత్ స్థాయి అధికారులు (బీఎల్ఓలు) క్షేత్రస్థాయిలో ఇంటింటికీ వెళ్లి సర్వే నిర్వహించలేదని, ఈ ఓట్ల తొలగింపు ప్రక్రియ వల్ల పేదలు, వలస కార్మికులే ఎక్కువగా నష్టపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 2002 నాటి ఓటర్ల జాబితాను ప్రామాణికంగా తీసుకోవడం ఆచరణ సాధ్యం కాదని, పాత రికార్డులను సాకుగా చూపుతూ పౌరుల ఓటు హక్కును నిరాకరించడం సరైన పద్ధతి కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఎలాంటి పక్కా కారణాలు లేకుండా సుమారు 73 లక్షల ఓట్లను తొలగించారని, మరో 92 లక్షల ఓట్లను అనుమానిత జాబితాలో చేర్చారని మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు. నియోజకవర్గాల పునర్విభజన, పోలింగ్ కేంద్రాల మార్పుల వల్ల తలెత్తిన సాంకేతిక సమస్యలు ఈ గందరగోళానికి కారణమయ్యాయని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం సీబీఐ, ఈడీల తరహాలోనే ఎన్నికల సంఘాన్ని కూడా తన 'పాకెట్ సంస్థ'గా మార్చుకుందని ఆయన తీవ్రంగా విమర్శించారు.