BREAKING
సెర్ప్ కార్యక్రమాలను విజయవంతం కోసం జిల్లా సమాఖ్య కృషి చేయాలి కారులో 22 కిలోల గంజాయి మరో హైదరాబాద్: కల్పనల నీడ నుంచి వాస్తవ ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఒక సాధారణ యువకుడి కథ! ఇండియన్ చలనచిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి అజేయ ప్రస్థానానికి 48 వసంతాలు! ‘గరివిడి లక్ష్మి’ గ్రాండ్ రిలీజ్ డేట్ ఖరారు: అక్టోబర్ 17న థియేటర్లలోకి ఆనంది బయోపిక్! గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించిన రాకా చిత్రం.. అల్లు అర్జున్, అట్లీల అరుదైన ఘనత! ఘనంగా దసరా ‘కొత్త బంగారు లోకం’ జోడీ మళ్లీ రిపీట్: 18 ఏళ్ల తర్వాత వరుణ్ సందేశ్, శ్వేతా బసు ప్రసాద్ కాంబో కలయిక! ఆస్ట్రేలియా ఆన్‌లైన్ భద్రత: ఏఐ మరియు సోషల్ మీడియా నిబంధనలపై గ్లోబల్ టెక్ దిగ్గజాల మద్దతు కోరుతున్న ప్రధాని అంటోనీ అల్బనీస్! ఎండాకాలం బూచి చూపి రైతులకు నీళ్లివ్వరా? కాంగ్రెస్ సర్కార్‌పై డీకే అరుణ ధ్వజం ఆస్కార్స్ 2027 రేసులో నాగాలాండ్ చిత్రం ‘అంగ్’: కొత్త నిబంధనలతో నేరుగా అర్హత సాధించిన వైనం ఆర్‌బిఐ సంచలన నిర్ణయం ఆగష్టు 26 భోటేకోశి-త్రిశూలి విపత్తు అధ్యయనం కోసం 15 మంది సభ్యుల కమిటీని ఏర్పాటు చేసిన నేపాల్ సింబు స్ట్రెయిట్ తెలుగు సినిమా లాక్: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించే భారీ ప్రాజెక్ట్ షేక్ అహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ కన్నుమూత

మంత్రి పొంగులేటి తక్షణమే రాజీనామా చేయాలి: హరీశ్ రావు

Select Suryaa Now
మంత్రి పొంగులేటి తక్షణమే రాజీనామా చేయాలి: హరీశ్ రావు

సమస్యలను పరిష్కరించాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త చిక్కులు సృష్టిస్తోందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరి పిచ్చోడి చేతిలో రాయిలా తయారైందని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాత్రికి రాత్రే అనేక కాలనీలను 22ఏ నిషేధిత భూముల జాబితాలో చేర్చడం వల్ల సామాన్య ప్రజలు నరకం చూస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 22ఏ నిషేధిత భూముల జాబితాను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 22ఏ నిషేధిత భూముల వ్యవహారంలో జరిగిన పెద్ద తప్పిదానికి నైతిక బాధ్యత వహిస్తూ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన పదవికి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మంత్రిని పదవి నుంచి తొలగించకపోతే... ముఖ్యమంత్రి, మంత్రులు కలిసే ఈ భూదందా చేశారనే అనుమానాలు ప్రజల్లో మరింత బలపడతాయని వ్యాఖ్యానించారు. పెద్ద తప్పు చేసి ఇప్పుడు క్షమాపణలు చెబితే ప్రజల బాధలు తీరవని, అసలు ఈ భూములను నిషేధిత జాబితాలో చేర్చమని ఆదేశించింది ఎవరో సమాధానం చెప్పాలని నిలదీశారు. ప్రభుత్వం చేసిన తప్పులను అధికారుల మీదికి నెట్టి తప్పించుకోవాలని చూడటం సరికాదని, వారు ఏర్పాటు చేసిన టోల్‌ఫ్రీ నంబర్ కూడా పనిచేయడం లేదని విమర్శించారు. భూములను నిషేధిత జాబితాలో పెట్టింది ప్రభుత్వమే కాబట్టి, ప్రజల నుంచి మళ్లీ దరఖాస్తులు తీసుకోకుండా వెంటనే ఆ జాబితా నుంచి తొలగించాలని హరీశ్ రావు స్పష్టం చేశారు. 2008లోనే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం యూఎల్సీని రద్దు చేయడంతో ఆ స్థలాలు పట్టా భూములుగా మారాయని... అలాగే జీఓల ద్వారా మినహాయింపు పొందిన హెచ్ఎండీఏ, హుడా భూములను కూడా ఇప్పుడు 22ఎ లో చేర్చి రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల ప్రజలను వేధిస్తున్నారని ఆరోపించారు.  కాంగ్రెస్ పాలనలో కల్యాణలక్ష్మి పథకం ‘సంతానలక్ష్మి’గా మారిపోయిందని, పెళ్లి సమయానికి అందాల్సిన సాయం పిల్లలు పుట్టిన తర్వాత గానీ రావడం లేదని ఎద్దేవా చేశారు. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, తప్పు చేసిన కాంగ్రెస్ నేతలను చట్టపరంగా బాధ్యులను చేస్తామని హెచ్చరిస్తూ, 22ఎ భూముల అంశంపై కేసీఆర్ నాయకత్వంలో అసెంబ్లీ వేదికగా పోరాటం కొనసాగిస్తామని ప్రకటించారు.