BREAKING
రూ.1.55 లక్షలకు గణేశుడి లడ్డూ వేలం ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన షెడ్యూల్.. పిఠాపురం, కాకినాడలో వివిధ కార్యక్రమాలు కోట్లాది రూపాయలతో రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణం : ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు: ఎమ్మెల్యే బోడే ప్రసాద్ స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలి: దేవభక్తుని చక్రవర్తి ఫైన్లు వేయడం మా ప్రాధాన్యత కాదు.. అవగాహన కల్పించడమే లక్ష్యం భీమవరం సోమేశ్వర జనార్ధన స్వామి ఆలయం.. కార్తీకమాసంలో దర్శించుకోవాల్సిన పంచారామ క్షేత్రం సేవా పఖ్వాడాలో భాగంగా విదేశాల్లోని భారత రాయబార కార్యాలయాల ఆధ్వర్యంలో ‘వికసిత్ భారత్ రన్’ చామనపల్లి వినాయక మండపాల్లో ఆకుల నరసన్నకు ఘన సన్మానం హిందూ సమాజానికి కులతత్వం, అంటరానితనం మచ్చ: సామాజిక సామరస్యానికి పిలుపు జీవీఎంసీ ఎన్నికల్లో వైసీపీ విజయమే లక్ష్యం ఘనంగా యోగా కార్యక్రమం.. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆసియా క్రీడల్లో రజతం సాధించిన మహిళా షూటర్లకు ప్రధాని మోదీ ప్రశంసలు: దేశానికి గర్వకారణమంటూ అభినందనలు ఆకర్షణీయంగా స్కూల్ యూనిఫారాలు : సీఎం రేవంత్

రేవంత్ ఇల్లు నిషేధిత జాబితాలో ఉంది

Select Suryaa Now
రేవంత్ ఇల్లు నిషేధిత జాబితాలో ఉంది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసం కూడా నిషేధిత ఆస్తుల జాబితాలో ఉందని, దానిని ఆ జాబితా నుంచి తొలగించేందుకు ప్రభుత్వం తెరవెనుక ప్రయత్నాలు చేస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు సంచలన ఆరోపణలు చేశారు. ఈ అంశంపై సమగ్ర విచారణ జరిపి, తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సోమవారం హరీశ్ రావు మీడియాతో మాట్లాడుతూ, "ముఖ్యమంత్రి నివాసానికే ఈ పరిస్థితి ఎదురైతే, ఇక సామాన్య ప్రజల గతి ఏమిటి?" అని ప్రశ్నించారు. అసలు ఏ ప్రాతిపదికన ఆస్తులను నిషేధిత జాబితాలో చేర్చారో విచారణ జరపాలని, ఆ జాబితాలో ఉన్న ఆస్తులు పూర్తి వివరాలను బహిర్గతం చేయాలని కోరారు. ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం స్పష్టమైన కాలపరిమితిని ప్రకటించాలని డిమాండ్ చేశారు. నిషేధిత జాబితాకు సంబంధించి సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసినప్పటికీ, ప్రభుత్వం నుంచి ఎటువంటి సమాధానం రావడం లేదని ఆయన విమర్శించారు.