BREAKING
ఇథియోపియాలో మళ్లీ రాజుకున్న యుద్ధజ్వాలలు: ప్రభుత్వ బలగాలపై సాయుధ గ్రూపుల భారీ ఆకస్మిక దాడి హౌతీలతో యుద్ధంలో సౌదీ అరేబియాకు బ్రిటన్ మద్దతు ఎంత?: వెలుగులోకి విస్తుపోయే నిజాలు తీవ్రవాద ధోరణుల పర్యవసానాలను చవిచూస్తున్న ఐరోపా సంప్రదాయ మితవాదులు: కుప్పకూలుతున్న రాజకీయ పట్టు ట్రంప్‌తో జిన్‌పింగ్ భేటీ: వాణిజ్య యుద్ధంలో అసలైన విజేత ఎవరు? జెలెన్‌స్కీ-ట్రంప్ చర్చల వెంటనే ఉక్రెయిన్‌పై రష్యా విరుచుకుపాటు: వైమానిక దాడుల్లో ఆరుగురు మృతి ప్రపంచాన్ని ముంచెత్తనున్న ఎల్ నినో విపత్తు: 4.5 లక్షల మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తల హెచ్చరిక భారత్‌కు డ్రోన్లు విక్రయిస్తున్న సంస్థపైనే పాకిస్తాన్ ట్రంప్ బెట్: సరికొత్త రక్షణ వ్యూహంపై సర్వత్రా ఆసక్తి ఇథియోపియాలో వేడెక్కిన అంతర్యుద్ధం: అబీ అహ్మద్ ప్రభుత్వానికి ఏడు తిరుగుబాటు గ్రూపుల కూటమి ముప్పు ఎంత? విదేశాల్లో భారతీయ యువతకు బంపర్ ఆఫర్ ఇరాన్‌తో ఒప్పందం అంత సులువు కాదు: అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో స్పష్టీకరణ వెనిజులా రుణ పునర్వ్యవస్థీకరణపై ట్రంప్‌తో కీలక చర్చలు నల్లగొండలో శోభాయమానంగా గణనాథుడి శోభయాత్ర ఒమన్ తీరంలో భారత్‌కు వస్తున్న కార్గో నౌకపై క్షిపణి దాడి బ్రెజిల్ ఎన్నికల్లో సరికొత్త చరిత్ర గణేష్ ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, మిర్యాలగూడ అర్బన్, మేజర్

రూ.15 వేల కోట్ల పెట్టుబడులే లక్ష్యం

Select Suryaa Now
రూ.15 వేల కోట్ల పెట్టుబడులే లక్ష్యం

తెలంగాణలో పరిశ్రమల రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ కీలక పాత్ర పోషించనుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే నేరుగా, మరుగున దాదాపు 2 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సుమారు 3,245 ఎకరాల భారీ విస్తీర్ణంలో రూ. 15,000 కోట్ల పెట్టుబడులే లక్ష్యంగా ఈ పారిశ్రామిక నగర రూపుదిద్దుకుంటోందని తెలిపారు.

కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, పీయూష్ గోయెల్‌లు ఢిల్లీ నుంచి నిర్వహించిన 'నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్‌మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్ ట్రస్ట్' సమీక్షా సమావేశంలో సచివాలయం నుంచి మంత్రి శ్రీధర్ బాబు వర్చువల్‌గా పాల్గొన్నారు. ఈ ప్రాజెక్టును EPC (ఇంజినీరింగ్, ప్రొక్యూర్‌మెంట్, కన్‌స్ట్రక్షన్) పద్ధతిలో వేగవంతంగా పూర్తి చేస్తున్నామని, 2028 మార్చి నాటికి అన్ని నిర్మాణ పనులను పూర్తి చేయాలని నిర్ణయించుకున్నామని వివరించారు.

ఈ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలో భూకేటాయింపుల ద్వారా తెలంగాణ ప్రభుత్వం 51 శాతం భాగస్వామ్యం వహిస్తుండగా, అవసరమైన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కోసం కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తోందని మంత్రి వెల్లడించారు. పరిశ్రమల ఏర్పాటుకు వీలుగా 'ప్లగ్ అండ్ ప్లే' వసతులను సత్వరమే కల్పిస్తున్నామని చెప్పారు. అంతేకాకుండా, 'భారత్ ఔద్యోగిక్ వికాస్ యోజన' (భవ్య) పథకంలో భాగంగా కేంద్రం ప్రారంభించనున్న 100 ప్లగ్ అండ్ ప్లే ఇండస్ట్రియల్ పార్కులలో నాలుగింటిని తెలంగాణకు కేటాయించాలని పీయూష్ గోయెల్‌కు శ్రీధర్‌బాబు విజ్ఞప్తి చేశారు.