BREAKING
నేటి రాశి ఫలాలు: సెప్టెంబర్ 23, 2026 - 12 రాశుల దినఫలాలు మరియు పరిహారాలు నేటి పంచాంగం: 23 సెప్టెంబర్ 2026, బుధవారం - తిథి, నక్షత్రం మరియు శుభ ముహూర్తాలు ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో 'ది పారడైజ్' ప్రీమియర్: తెలంగాణ ప్రభుత్వానికి హీరో నాని విజ్ఞప్తి టాలీవుడ్‌లో వరుస చిత్రాలు చేసినా సడన్‌గా కనిపించకుండాపోయిన బ్యూటీ.. ఎవరితను? స్టార్ హీరోయిన్ చెల్లెలుగా ఎంట్రీ.. కెరీర్ పీక్స్‌లో ఉండగానే సినిమాలకు దూరమైన నటి నిషా అగర్వాల్ పుష్ప సినిమాలో ఆ ఫేమస్ రోల్ మొదట నాకే వచ్చింది: టాలీవుడ్ నటుడు శివాజీ షాకింగ్ కామెంట్స్ విశాఖలో ఘోరం - యువకుడిపై పెట్రోల్ పోసి హత్యాయత్నం చిరుతపులి చర్మాల వేట కేసు: వైల్డ్లైఫ్ ఎస్ఓఎస్ సీఈఓకు అరెస్టు నుంచి రక్షణ కల్పించిన సుప్రీంకోర్టు 2027 ఆర్థిక సంవత్సరంలో భారత్ సరికొత్త రికార్డు: 8 గిగావాట్ల పవన విద్యుత్ సామర్థ్యం జోడింపునకు సన్నాహాలు 2019 శ్రీలంక ఈస్టర్ బాంబు పేలుళ్ల కేసులో సంచలన తీర్పు: 15 మంది నిందితులను దోషులుగా తేల్చిన కోర్టు నేరటోనిగూడెంలో శ్రీకృష్ణ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా అన్నప్రసాద వితరణ వికారాబాద్ మహావీర్ మెడికల్ కాలేజీలో కలకలం రేపిన ర్యాగింగ్ ఉదంతం సింగారం కింగ్ డైనమిక్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా అన్నప్రసాద వితరణ సూర్య ప్రధాన కార్యాలయంలో ఘనంగా గణపతి నవరాత్రులు: హోరాహోరీగా లడ్డూ వేలంపాట ది ప్యారడైజ్ చిత్రంలో జర్నలిస్ట్ పాత్రపై వస్తున్న రూమర్స్‌కు చెక్ పెట్టిన కయాదు లోహర్

ప్రతి పేద కుటుంబానికి ఒక ఎకరం భూమి ఇస్తాం: కవిత

Select Suryaa Now
ప్రతి పేద కుటుంబానికి ఒక ఎకరం భూమి ఇస్తాం: కవిత

తెలంగాణ రక్షణ సేన అధ్యక్షరాలు కల్వకుంట్ల కవిత సంచలన ప్రకటన చేశారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ‘భూ లక్ష్మి పథకం’ కింద భూమి లేని పేదలకు ఎకరం చొప్పున ఇస్తామని ప్రకటించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి భూమి అంటే కేవలం వ్యాపార లావాదేవీలే కావచ్చు కానీ, పేద బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు భూమి, అడవి అంటే పంచప్రాణాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఏ ప్రాజెక్టు చేపట్టినా ముందుగా పేదల అసైన్డ్ భూములనే లాక్కుంటున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. బంజారాహిల్స్‌లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సోదరులు, భట్టి విక్రమార్క కుటుంబ సభ్యుల దోపిడీ, రాక్షస పాలన సాగుతోందని ఆరోపించారు. ప్రభుత్వం దాదాపు 30 వేల ఎకరాల అసైన్డ్ భూములను లాక్కుందని, ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పినట్లుగా పేదల అసైన్డ్ భూములపై వారికే పూర్తి యాజమాన్య హక్కులు కల్పించాలని సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి ‘మేకవన్నె పులి’ లాంటి వారని... ఆయన చెప్పేది సామాజిక న్యాయం అయితే, చేసేది ఆటవిక న్యాయమని విమర్శించారు. కేబినెట్ తో పాటు ప్రభుత్వ సలహాదారులు, ఆర్టీఐ కమిషనర్ల నియామకాల వరకు బడుగు, బలహీన వర్గాలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అగ్రవర్ణాలకు ఒక న్యాయం, పేదలకు మరొక న్యాయం నడుస్తోందని మండిపడ్డారు.