BREAKING
అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల: వేర్వేరు గ్రూపుల్లో భారత్, పాకిస్థాన్! చెలరేగిన రషీద్ ఖాన్: బంగ్లాదేశ్‌ను దెబ్బకొట్టిన అఫ్గానిస్తాన్ స్టార్ స్పిన్నర్! ఆస్ట్రేలియాపై టెంబా బవుమా వీరోచిత శతకం: కష్టాల్లో ఉన్న జట్టును ఆదుకున్న సౌతాఫ్రికా కెప్టెన్! గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా కాంగ్రెస్ నాయకులు మాలోత్ భోజ్య నాయక్ సిక్సర్లతో చరిత్ర సృష్టించిన షెఫాలీ వర్మ: హర్మన్‌ప్రీత్ కౌర్ రికార్డు బద్దలు కొట్టిన టీమిండియా ఓపెనర్! తొట్టంబేడు పోలింగ్ కేంద్రం వద్ద యుద్ధ వాతావరణం క్రికెట్ కెరీర్స్: అంచనాలు అందుకోలేక వెనుకబడిన ఏడుగురు ప్రతిభావంతులైన ఆటగాళ్లు! శ్రీకాళహస్తి పోలీసులు పక్షపాత వైఖరి తిరుపతి పార్లమెంటు సభ్యులు ఎం గురుమూర్తి హార్దిక్ పాండ్యా కోసం ఏకంగా 2,400 కిమీ నడిచిన అభిమాని: ఆశ్చర్యకరమైన రీతిలో స్పందించిన స్టార్ క్రికెటర్! పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం ప్రజల రక్షణే ధ్యేయంగా పోలీసుల నిరంతర సేవలు: జాయింట్ కలెక్టర్ కల్పశ్రీ, ఎస్పీ అద్నాన్ నయీం అస్మి శ్రీకాళహస్తి ప్రాంతంలో నామినేషన్లు భారత్ చేతిలో చిత్తు: చెత్త రికార్డును మూటగట్టుకున్న జింబాబ్వే మహిళల జట్టు! చోరీకి గురైన బస్సు ఆచూకీ లభ్యం -జీపీఆర్ఎస్ తో దొరికిపోయిన దొంగ -చాగలమర్రిలో పోలీసులు బస్ స్వాధీనం 'పూలను పూజించే గొప్ప పండుగ బతుకమ్మ' : నందికంటి శ్రీధర్ తెలంగాణ, మహారాష్ట్రలను దాటి మధ్యప్రదేశ్‌లో నరసింగాపూర్ దిశగా విశ్వకర్మ ఏక్తా యాత్ర..

అమరుల త్యాగాలు మరువలేనివి:ఘట్‌కేసర్ ఇన్‌స్పెక్టర్ పి. కిరణ్

Select Suryaa Now
అమరుల త్యాగాలు మరువలేనివి:ఘట్‌కేసర్ ఇన్‌స్పెక్టర్ పి. కిరణ్

ఘట్‌కేసర్, మేజర్ న్యూస్: విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని ఘట్‌కేసర్ ఇన్‌స్పెక్టర్ పి. కిరణ్ అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా మంగళవారం ఘట్‌కేసర్ పోలీస్‌స్టేషన్‌లో అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి, రెండు నిమిషాలు మౌనం పాటించారు.
ప్రజల ధన, మాన, ప్రాణ రక్షణతో పాటు శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసులు అంకితభావంతో పనిచేస్తున్నారని కిరణ్ పేర్కొన్నారు. ప్రజా రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల స్ఫూర్తితో పోలీసు సిబ్బంది మరింత నిబద్ధతతో ప్రజలకు సేవలందించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్‌ఐలు శేఖర్, రాఘవేందర్, ఏఎస్సైలు, హెడ్‌ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, హోంగార్డులు, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

రిపోర్టర్: గుర్రం రమేష్, ఘట్కేసర్, మేడ్చల్ జిల్లా.