విశాఖపట్నం నుంచి కిరండోల్ వెళ్తున్న రైలుకు శుక్రవారం పెను ప్రమాదం తప్పింది. అర్ధరాత్రి అనంతగిరి మండలం తైడా-చిమిడిపల్లి స్టేషన్ల మధ్య ప్రయాణిస్తుండగా పెద్ద వృక్షం రైలు విద్యుత్ లైన్‌పై కూలిపోవడంతో మంటలు చెలరేగాయి. ఈ ఘటనతో ప్రయాణికులు ఒక్కసారిగా తీవ్ర భయందోళనలకు గురయ్యారు. రైల్వే అధికారులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే స్పందించి, 3 గంటలపాటు శ్రమించి చెట్టును తొలగించి విద్యుత్ లైన్‌ను పునరుద్ధరించారు.