శ్రీశైలం జలాశయానికి వరద నీరు కొనసాగుతోంది. దీంతో అధికారులు జలాశయం 5 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. జలాశయం ఇన్‌ఫ్లో 2,18,386 క్యూసెక్కులుండగా, ఔట్‌ఫ్లో 1,94,854 క్యూసెక్కులుంది. పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు..ప్రస్తుతం 884.50 అడుగులు ఉంది. పూర్తిస్థాయి నీటినిల్వ 215.8070 టీఎంసీలు కాగా 212.9198 టీఎంసీలు ఉంది. కుడి, ఎడమ నుంచి జలవిద్యుత్ కేంద్రంలో ఉత్పత్తి కొనసాగుతోంది.