ఏపీ సీఎం వైఎస్ జగన్ సోమవారం ఢిల్లీలో ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో జగన్ ప్రధానితో పలు విషయాలపై చర్చించారు. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు అంశాన్ని జగన్ ప్రధానంగా ప్రస్తావించినట్టు తెలుస్తోంది. పోలవరం నిర్వాసితులకు పునరావాస కల్పన, పెండింగ్ బిల్లుల మంజూరు అంశాలపై సీఎం చర్చించారు. రాష్ట్ర విభజన హామీలను నెరవేర్చాలని ప్రధాని కోరినట్టు సమాచారం.