దేశవ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్న తరుణంలో వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. యూరోపియన్ సెంటర్ ఫర్ మీడియం-రేంజ్ వెదర్ ఫోర్‌కాస్ట్స్ (ECMWF) అంచనాల ప్రకారం.. ఈ ఏడాది రుతుపవనాలు ముందుగానే భారతదేశంలోకి ప్రవేశించనున్నాయి. మే నెలాఖరు నాటికి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మౌసమ్ తక్ వ్యవస్థాపకుడు దేవేంద్ర త్రిపాఠి ప్రకారం.. మే 27-29 తేదీల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. అండమాన్-నికోబార్ దీవుల్లో మే 18-25 మధ్య రుతుపవనాలు చేరుకోవచ్చని, ఆ తర్వాత పశ్చిమ, ఉత్తర దిశలకు విస్తరిస్తాయని అంచనా వేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa