ఉమ్మడి కృష్ణా జిల్లాలో పాల నాణ్యత తనిఖీలు కలకలం సృష్టించాయి. ఫుడ్‌సేఫ్టీ అధికారులు సేకరించిన పాల శాంపిల్స్‌లో 4 చోట్ల కొవ్వు శాతం తక్కువగా ఉన్నట్లు ల్యాబ్ నివేదిక వెల్లడించింది. 5.5% ఉండాల్సిన కొవ్వు కేవలం 3% మాత్రమే ఉన్నట్లు తేలడంతో నలుగురు పాల విక్రేతలపై అధికారులు కేసులు నమోదు చేశారు. కొవ్వు తీసేసిన పాలు తాగడం వల్ల శరీరానికి పోషకాలు అందవని, కల్తీని అరికట్టేందుకు జిల్లాల్లో తనిఖీలు ముమ్మరం చేశామని అధికారులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa