దేశాభివృద్ధికి కీలకమైన జనగణన ప్రక్రియలో ప్రజలు భాగస్వామ్యం కావాలని ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ పిలుపునిచ్చారు. గురువారం ఆయన తన నివాసంలో స్వయం గణన ప్రక్రియను పూర్తి చేసి, కుటుంబ వివరాలు, గృహ సంబంధిత గణాంకాలను అధికారులకు ఆన్లైన్ ద్వారా అందించారు. ప్రభుత్వ పథకాలు అర్హులకు చేరాలన్నా, నియోజకవర్గ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలన్నా ఖచ్చితమైన గణాంకాలు అవసరమని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో గ్లోరియా, తహసిల్దార్ సలీమా, ఇతర అధికారులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa