నేటి కాలంలో పెరుగుతున్న ఫ్యాటీ లివర్ సమస్యకు పరిష్కారంగా నారింజ పండ్లను ప్రతిరోజూ తినడం వల్ల కాలేయంలో కొవ్వు తగ్గుతుందని తాజా అధ్యయనం వెల్లడించింది. న్యూట్రియెంట్స్ జర్నల్‌లో ప్రచురించిన ఈ అధ్యయనంలో 30-65 ఏళ్ల 60 మందిపై పరీక్షలు నిర్వహించారు. వీరిలో సగం మందికి నాలుగు వారాల పాటు రోజుకు 400 గ్రాముల గింజలులేని నారింజ పండ్లను ఇచ్చారు. ఈ బృందంలో కాలేయంలో కొవ్వు తగ్గడంతో పాటు కాలేయ ఆరోగ్యం మెరుగుపడింది. అయితే కేవలం నారింజ పండ్లు మాత్రమే ఫ్యాటీ లివర్‌ను పూర్తిగా నయం చేయలేవని నిపుణులు సూచిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa