జార్ఖండ్‌లోని దుమ్కా జిల్లాలో ఆదివారం దారుణం జరిగింది. రామ్‌గఢ్ ప్రాంతంలోని తన మేనమామ ఇంటికి వెళ్లేందుకు 14 ఏళ్ల బాలిక ఓ ఆటో ఎక్కింది. అయితే బాలికపై కన్నేసిన ఆ ఆటోడ్రైవర్ ఆమెపై అత్యాచారానికి యత్నించాడు. దీనిని బాలిక తీవ్రంగా ప్రతిఘటించింది. ఇది తట్టుకోలేని నిందితుడు ఆ బాలికను దారుణంగా కొట్టి, నిర్మానుష్య ప్రదేశంలో పడేశాడు. దాడిలో బాలిక కాలు విరిగింది. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.