మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని, ఎంత పని ఉన్నాసరే బ్రేక్ ఫాస్ట్ అస్సలు మానేయకూడదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉదయం తీసుకునే అల్పాహారం మానేస్తే దాని ప్రభావం మొత్తం ఆరోగ్యంపై పడుతుందని అంటున్నారు. బ్రేక్ ఫాస్ట్ మానేయటం వల్ల అధిక రక్తపోటు, షుగర్, ఇతర గుండె సంబంధిత సమస్యలు తలెత్తుతాయని హెచ్చరిస్తున్నారు.