హర్యానాలోని జులనా పోలీస్ స్టేషన్కు ఓ మహిళ 2016లో ఫిర్యాదు చేయడానికి వెళ్లింది. అయితే అక్కడ పని చేస్తున్న విజయ్ అనే కానిస్టేబుల్ ఆమెపై కన్నేసి పరిచయం పెంచుకున్నాడు. అదును దొరకడంతో ఒకరోజు ఆమెకు మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేశాడు. అంతేకాకుండా ఆ ఘటనను వీడియో తీసి ఆమెను తరచూ బ్లాక్ మెయిల్ చేస్తూ ఆరేళ్లుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు. అది సహించలేని బాధిత మహిళ ఇటీవల స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది.