ఓ చంటిపాపను ఎత్తుకోవడంతో పాటు తన కొడుకును తీసుకుని ఓ వ్యక్తి ఫుడ్ డెలివరీ చేయడం నెటిజన్ల హృదయాలను కదిలిస్తోంది. ఆ జొమాటో డెలివరీ బోయ్ గురించి ఫుడ్ బ్లాగర్ సౌరభ్ పంజ్వానీ తాజాగా ఇన్స్టాగ్రామ్లో వీడియో షేర్ చేశారు. పొట్ట కూటి కోసం కష్టపడుతున్న అతడు తన ఇద్దరు బిడ్డలను బైక్పై ఎక్కించుకుని రోజంతా ఫుడ్ డెలివరీ చేస్తున్నాడని పేర్కొన్నాడు. అతడి కష్టపడుతున్న తీరును నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.