స్వాతంత్య్ర సమరయోధుడు, బ్రిటీష్ పోలీసుల తుఫాకులకు గుండె చూపిన ధీరుడు, ఆంధ్ర ప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు 150వ జయంతి వేడుకలను ఘంటసాల జడ్పీ హైస్కూల్లో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హైస్కూల్ హెచ్ఎమ్.ఎం.శ్రీరంగవల్లి ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. స్వాతంత్య్ర పోరాటంలో, ప్రత్యేకాంధ్ర ప్రదేశ్ ఏర్పడటంలో ప్రకాశం పంతులు కృషి, ప్రకాశం బ్యారేజీ నిర్మాణంతో పాటు ముఖ్యమంత్రిగా టంగుటూరి రాష్ట్రాభివృద్ధికి చేసిన సేవలను హెచ్ఎమ్ శ్రీరంగవల్లి విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.