కొత్తగా కొన్న టెస్లా కారు లాక్ ఓపెన్ చెయ్యడానికి వివోకీ ఎపెక్స్ చిప్ ఉంటే చాలు. అయితే దాన్ని ఏ వస్తువులోనో ఇంప్లాంట్ చేయించడం ఎందుకనుకున్నాడో ఏమోగానీ.. ఆ చిప్‌ను తన చేతిలోనే పెట్టించేసుకున్నాడు బ్రాండన్ డలాలీ అనే వ్యక్తి. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. చిప్ పెట్టిన తర్వాత కారు తాళం తీసేందుకు సెన్సార్ల వద్ద అతని చేతిని ఉంచితే చాలు.. టక్కున లాక్ ఓపెన్ అయిపోతోంది.