ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 23, 2022, 05:14 PM

విశాఖపట్నం జిల్లా, చోడవరం: భార్య మందలించిందని భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై యమునా కథనం ప్రకారం.. గౌరీపట్నం గ్రామానికి చెందినపరిమి జగ్గారావు (35) తాపీమేస్త్రి. రోజూ మద్యం తాగుతున్నాడని భార్య సుభద్ర సోమవారం మందలించింది. భార్య బయట బట్టలు ఉతుకుతున్నసమయంలో ఇంటిలో ఫ్యానుకు ఉరేసుకున్నాడు. కుటుంబసభ్యులు చోడవరం ప్రభుత్వాసుపత్రికి తరలించినా అప్పటికే జగ్గారావు మృతిచెందాడని వైద్యులు ధ్రువీకరించారు. వీరికి కొడుకు, కూతురు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com